Rajinikanth : మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థ పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 1 నిర్మాణ సంస్థ గా ఎదిగే దిశగా అడుగులు వేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2015 వ సంవత్సరం లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ చిత్రం తో ఈ సంస్థ ప్రస్థానం మొదలైంది. తొలిసినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో, ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ చిత్రం చేశారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇక అక్కడి నుండి రంగస్థలం, ఉప్పెన,వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, పుష్ప, పుష్ప ది రూల్ ఇలా ఒక్కటా రెండా ఇండస్ట్రీ ని షేక్ చేసే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. కేవలం పెద్ద హీరోలతో మాత్రమే కాకుండా , చిన్న సినిమాలు కూడా తీసి సూపర్ హిట్స్ ని అందుకొని తమ సంస్థ బ్రాండ్ విలువని పెంచారు.
Also Read : ఐశ్వర్య రాయ్ తో నటించినందుకు రజినీకాంత్ ఇన్ని అవమానాలు ఎదురుకున్నాడా?
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సంస్థ తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి, హిందీ ఇండస్ట్రీ లోకి ఇక కాలం లో అడుగుపెట్టి, రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని తమ సంస్థ ని ఇతర భాషల్లో కూడా విజయవంతంగా విస్తరింపజేయడం లో సక్సెస్ అయ్యారు. అజిత్(Thala Ajith) తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాన్ని తీసి సూపర్ హిట్ ని అందుకున్న ఈ సంస్థ, ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) తో ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు, నాని తో ‘సరిపోదా శనివారం’ లాంటి సూపర్ హిట్ ని తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ(Vivek Athreya). మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో రజినీకాంత్ హీరో గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం స్టోరీ రైటింగ్ లో బిజీ ఉన్నాడు వివేక్ ఆత్రేయ.
ఈ కథ రజినీకాంత్ కి నచ్చితే వివేక్ ఆత్రేయ నే డైరెక్టర్. ఒకవేళ నచ్చకపోతే మాత్రం డైరెక్టర్ మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ లో రజినీకాంత్ సినిమా ఉంటుంది అనేది మాత్రం ఖరారు అయ్యింది. భారీ మొత్తంలో రజినీకాంత్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఇక మరో లెవెల్ కి వెళ్ళిపోయినట్టే లెక్క. ఎందుకంటే రజినీకాంత్ సినిమా సూపర్ హిట్ అంటే, కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సౌత్ లో రజినీకాంత్ తో సినిమా తీయబోతున్న మైత్రీ మూవీ మేకర్స్, నార్త్ ఇండియా లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈమేరకు సల్మాన్ ఖాన్ తో పలు దఫాలు చర్చలు కూడా జరిపారట.
Also Read : ఇది కదా కాంబినేషన్ అంటే… రజినీకాంత్ మూవీలో నాగార్జున, ఇంట్రెస్టింగ్ డిటైల్స్!