https://oktelugu.com/

Rajinikanth Famous Dialogues: రజినీకాంత్ కెరీర్ లో పాపులర్ డైలాగులు ఇవే !

Rajinikanth Famous Dialogues: డైలాగ్ అంటే.. కేవలం మాటలు మాత్రమే కాదు, సినిమాని ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చేసే ఒక ప్రక్రియ. మాటల్లో ఎన్నో మూటలు ఉన్నాయి. మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి. అసలు మాటలు లేకపోయి ఉంటే.. ఈ ప్రపంచమే మొత్తం స్తంభించి పోతుందేమో. అందుకే, మాటలు జన జీవన గమనాన్ని ముందుకు నడుపుతున్నాయి. అయితే, సినిమా మాటల్లో ఎన్నో తూటాలు పేలాయి. ముఖ్యంగా డైలాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన సూపర్ స్టార్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 12, 2021 / 02:10 PM IST
    Follow us on

    Rajinikanth Famous Dialogues: డైలాగ్ అంటే.. కేవలం మాటలు మాత్రమే కాదు, సినిమాని ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చేసే ఒక ప్రక్రియ. మాటల్లో ఎన్నో మూటలు ఉన్నాయి. మాటల్లో ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి. అసలు మాటలు లేకపోయి ఉంటే.. ఈ ప్రపంచమే మొత్తం స్తంభించి పోతుందేమో. అందుకే, మాటలు జన జీవన గమనాన్ని ముందుకు నడుపుతున్నాయి.

    Rajinikanth Famous Dialogues

    అయితే, సినిమా మాటల్లో ఎన్నో తూటాలు పేలాయి. ముఖ్యంగా డైలాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన సూపర్ స్టార్ రజినీకాంత్. రజనీ చేసిన ప్రతి సినిమాల్లోనూ డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అద్భుతంగా అనిపిస్తాయి. మరి ముఖ్యంగా ఆ డైలాగ్స్ కొన్ని మనసుకు హత్తుకుపోతాయి. మరికొన్ని పవర్‌ఫుల్ పంచ్‌ లుగా మిగిలిపోతాయి.

    ఏది ఏమైనా రజిని డైలాగ్స్ అన్నీ సమాజంలో మంచిని పెంచేలానే ఉండడం విశేషం. అయితే, రజినీకాంత్ సినిమాల్లో గుర్తుండిపోయినా, పాపులర్ అయిన డైలాగులు ఇవే.

    Also Read: దెబ్బ అదుర్స్​ కదూ!… రజనీ సూపర్​ హిట్​ డైలాగ్స్ ఇవే

    దేవుడు శాసించాడు… అరుణాచలం పాటిస్తాడు – అరుణాచలం

    ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావాల్సినంత ఉంచుకుని మిగిలించి దానం చేస్తేనే మనశ్శాంతి – ముత్తు

    ఒక్కసారి తప్పుచేసిన వాడిని క్షమిస్తే వాడికి మరోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే – పెదరాయుడు

    నా జన్మ విరోధినైనా క్షమిస్తానేమో కాని వెంటే ఉండి వెన్నుపోటు పొడిచే వారిని అసలు క్షమించను.

    అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు – నరసింహా

    నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు – భాషా

    నాన్నా… పందులే గుంపుగా వస్తాయ్, సింహం సింగిల్ గా వస్తుంది – శివాజీ

    తెలిసింది గోరంత… తెలియాల్సింది కొండంత – బాబా

    మంచివాడు మొదట కష్టపడతాడు… కానీ ఓడిపోడు
    చెడ్డ వాడు ముందు సుఖపడతాడు… కానీ ఓడిపోతాడు – భాషా

    న్యాయానికి బంధం, బంధుత్వం ఒక్కటే… ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు – పెదరాయుడు

    నా దారి… రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే – నరసింహా

    నీకున్నది రాజకీయ బలం నాకున్నది ప్రజాబలం. మీరు పోలీస్ శక్తితో బతుకుతున్నారు. నేను ప్రజా శక్తితో బతుకుతున్నా… నా శక్తి ముందు నీ శక్తి జుజుబీ – నరసింహ

    Also Read: సూపర్​స్టార్​ తలైవా రజనీకాంత్​ పుట్టిరోజు నేడు.. విషెష్ తెలిపిన ప్రముఖులు

    Tags