Rajinikanth Remuneration: సీనియర్ స్టార్ రజనీకాంత్ ఏజ్ బార్ అయినా యంగ్ హీరోలకు పోటీనిస్తూ సినిమాలు తీస్తున్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నటిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. రజనీ నటించిన లేటేస్ట్ మూవీ ‘జైలర్’ గురువారం రిలీజ్ కానుంది. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైరల్ విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఈ తరుణంలో రజనీ కాంత్ ఈ సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.
కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న ‘జైలర్’ మూవీలో రజనీకాంత్ తో పాటు తమన్నా నటిస్తోంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునీల్ వంటి నటులు పోషిస్తున్న ఈ మూవీకి ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. దేశంలోనే కాకుండా మలేషియాలోనూ 200లకు పైగా థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. దీంతో గురువారం ఫస్ట్ షో తరువాత సినిమా టాక్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాటి నుంచి నేటి వరకు రజనీ తన యాక్టింగ్ తో ఇప్పటికీ అదరగొడుతున్నాడు. పాత్ర ఎలాంటిదైనా అందులో ఇమిడిపోతూ ప్రేక్షకులను అలరిస్తన్నాడు. 70 ఏళ్ల వయసులో కూడా డ్యాన్స్ చేస్తూ.. మాస్ గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. రజనీ తెరపై కనపిస్తే చాలు.. సినిమా ఎలా ఉన్న పర్వాలేదు.. అని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటారు. అందుకే రజనీతో సినిమా తీయాలని చాలా మంది నిర్మాతలు ముందుకు వస్తుంటారు.
ఈ నేపథ్యంలో రజనీ ఈ వయసులో కూడా నటిస్తున్నాడంటే ఆయన రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది? అన్న చర్చ సాగుతోంది. అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం జైలర్ సినిమా కోసం రజనీ రూ.110 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోల స్థాయి కంటే హై రేంజ్ లో రజనీ బడ్జెట్ ఉండడంతో ఆయన మార్కెట్ విలువ ఏంటోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే గురువారం థియేటర్లలో రజనీ ఆడియన్స్ ను ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి.