Rajinikanth: మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇక దాంతో ఆయన ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నాడు. ఇక ఇప్పటివరకు అడపాదడప ఒకటి రెండు హిట్లు వచ్చినప్పటికీ ఆయన హీరోగా మాత్రం నిలబడలేక పోతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు కావస్తున్న కూడా ఒక్కటి వరకు ఆయనకి ఒక్క సరైన సక్సెస్ లేదు అంటే ఆయన స్టోరీ సెలక్షన్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇప్పుడు ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని దక్కించుకోవాలనే ఉద్దేశ్యం తోనే ఆయన 150 కోట్లు బడ్జెట్ తో ‘భక్త కన్నప్ప ‘ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కన్నప్ప పాత్రలో విష్ణు కనిపిస్తుండగా, శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే దాని మీద ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే రాలేదు.
కానీ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మరొక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే, తమిళ్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ లాల్, మధుబాల లాంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఇక మోహన్ బాబు స్నేహితుడైన రజినీకాంత్ ని కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసి భారీ సక్సెస్ ని అందుకోవడమే పనిగా మంచు విష్ణు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగం గానే రజనీకాంత్ తో ఒక పాత్ర చేయిస్తున్నారు. అయితే ఈయన పాత్ర దాదాపు 5 నిమిషాల వరకు సినిమాలో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా రజినీకాంత్ తన కూతురు డైరెక్షన్ లో చేసిన ‘లాల్ సలామ్ ‘ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించి చేదు అనుభవాన్ని మూటగట్టుకున్నాడు.
మరి ఇలాంటి సమయంలో భక్తకన్నప్ప సినిమాతో మరోసారి అలాంటి పరాభవాన్ని పొందుతాడా లేదంటే తను ఇచ్చే గెస్ట్ అప్పియరెన్స్ మంచు విష్ణు కెరీయర్ ను నిలబెడుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మంచు వారి అబ్బాయి రోజు రోజుకీ ఈ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాడు…