https://oktelugu.com/

Rajinikanth: సినిమాలకు రజనీకాంత్ గుడ్ బై..!

రజనీకాంత్ నటించిన ‘బాబా’ సినిమా తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటారని అందరూ అన్నారు. కొద్ది రోజులు సినిమాలో నటించకపోయేసరికి అందరూ ఇక తలైవాను వెండితెరపై చూడలేమా? అని నిరాశ పడ్డారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 20, 2023 / 03:40 PM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి సంచలన న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అశేష అభిమానులను చూరగొన్న ఈ తలైవా త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఓ డైరెక్టర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ కాంత్ ఆ సినిమా తరువాత సినిమాలకు గుడ్ బై చెబుతారని చెప్పడం కలకలం రేపుతోంది. సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రజనీ తన మూవీస్ తో సెన్సెషనల్స్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. అలాంటి రజనీకాంత్ ఇక సినిమాలో కనిపించడు అంటే ఎవరికైనా షాకింగ్ న్యూసే. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎందుకలా చెప్పాడు? ఎవరా డైరెక్టర్?

    హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా రజనీ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన ‘లాల్ సలామ్’ మూవీ పోస్టర్ బయటకు వచ్చింది. ఇందులో రజనీ డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన కూతురు ఐశ్వర్య డైరెక్షన్ చేస్తున్న ఈ మూవీలో ఆమె కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కొనసాగుతుండగానే రజనీ 169 సినిమా ‘జైలర్’ కు కమిట్ అయ్యారు. దీనికి డాక్టర్ నెల్సన్ డైరెక్టర్. దీని తరువాత జ్ఞానవేల్ డైరెక్షన్లో మరో మూవీ చేస్తారని అంటున్నారు.

    ఇదే సమయంలో లోకేష్ కనకరాజ్ తో ఓ సినిమా చేసేందుకు రజనీ ఒప్పేసుకున్నాడు. అయితే ఇదే రజనీ చివరి సినిమా అని అంటున్నారు. ఈ సినిమా తరువాత రజనీ సినిమాలకు గుడ్ బై చెబుతారని నటుడు, డైరెక్టర్ మిష్కిన్ ఓ తమిళ ఆన్ లైన్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఇలా చెప్పడం తో రజనీ నిజంగానే సినిమాలు తీయడం ఆపేస్తారా? అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది.

    రజనీకాంత్ నటించిన ‘బాబా’ సినిమా తరువాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటారని అందరూ అన్నారు. కొద్ది రోజులు సినిమాలో నటించకపోయేసరికి అందరూ ఇక తలైవాను వెండితెరపై చూడలేమా? అని నిరాశ పడ్డారు. కొందరు అభిమానులు ఆయనను సినిమాల్లో నటించాలని పట్టుబట్టారు. దీంతో ‘చంద్రముఖి’ద్వారా మళ్లీ ఫాంలోకి వచ్చారు. ఆ తరువాత రోబో సినిమాతో రజనీ యంగ్ హీరోలందరినీ బీట్ చేశారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం సాగింది. కానీ సినిమాలకే తన జీవితం అని రజనీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వస్తున్న వార్తలపై రజనీ ఎలా స్పందిస్తారో చూడాలి.