Rajinikanth Dharman First Look: ‘కూలీ’ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ముందు సీబీ చక్రవర్తి ని డైరెక్టర్ గా ఎంచుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి అస్వత్ మారిముత్తు ని ఎంచుకున్నారు. గతం లో ఈయన ‘ఓ మై కడవలే ‘, ‘డ్రాగన్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. యూత్ ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాలు తీయడం లో ఇతను దిట్ట. అందుకే ఇతన్ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ ని అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో రజినీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నాడు.
ఇందులో హీరోయిన్స్ గా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ , రాశి ఖన్నా నటించబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రజినీకాంత్ చాలా వైల్డ్ డాక్టర్ గా కనిపించడం తో , అసలు కథ ఏమి అయ్యుంటుంది అనే ఆత్రుత అభిమానుల్లో , ప్రేక్షకుల్లో కలిగింది. ఈ వయస్సులో కూడా సూపర్ స్టార్ రజిని చెక్కు చెదరని స్టైల్, స్వాగ్ తో కనిపించడం అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , వచ్చే ఏడాది ఆరంభం లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రాన్ని పూర్తి చేశాడు . సెప్టెంబర్ నెలలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది ఎంత వరకు నిజమో చూడాలి. రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్.
ఇక పోతే ‘ధర్మన్’ విషయం లో అభిమానుల్లో కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి. ఈ చిత్రానికి ఇప్పటికే ఇద్దరు దర్శకులు మారారు. ఇప్పుడు మూడవ దర్శకుడు వచ్చాడు , అంటే స్టోరీ సరిగా లేదా?, ఎందుకని ఇంతకు ఇద్దరు డైరెక్టర్స్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారు?, రజినీకాంత్ తో సినిమా చేసే బంపర్ ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా?, ఈ అస్వత్ మారిముత్తు అయినా చివరి వరకు నిలకడగా నిలబడి షూటింగ్ ని పూర్తి చేసి వెళ్తాడా?, లేదా మధ్యలోనే వెళ్ళిపోతాడా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న ‘ధర్మన్’ ఫస్ట్ లుక్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసేయండి.
தர்மமே வெல்லும்!#Dharman #Thalaivar173 #SuperstarRajinikanth @rajinikanth #Mahendran @Dir_Ashwath @anirudhofficial @anbariv @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/9ghF9XgboI
— Kamal Haasan (@ikamalhaasan) June 24, 2026
