Hanu Man Movie: ‘హను మాన్’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేసిన స్టార్ హీరో విజయ్ సేతుపతి… హీరోయిన్ ఎవరంటే ?

Hanu Man Movie: యంగ్ హీరో తేజ సజ్జ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ… ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజ… ఆ తర్వాత హీరోగా జాంబీరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిచాడు. ఈ సినిమా తర్వాత ఇష్క్ అనే సినిమా చేయగా… […]

Written By: Raghava Rao Gara, Updated On : December 13, 2021 2:08 pm
Follow us on

Hanu Man Movie: యంగ్ హీరో తేజ సజ్జ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ… ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజ… ఆ తర్వాత హీరోగా జాంబీరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిచాడు. ఈ సినిమా తర్వాత ఇష్క్ అనే సినిమా చేయగా… ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇటీవల “అద్భుతం” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీ వేదిక విడుదలైన ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. “హను-మాన్” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి హనుమంతు క్యారెక్టర్ లో తేజ సజ్జా సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడని క్లారిటీ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా నుంచి అంజనాద్రి నుంచి మీనాక్షి ని కలవండి అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు మూవీలో హీరోయిన్ గా విజిల్ బ్యూటీ “అమృత అయ్యర్” ను మీనాక్షిగా పరిచయం చేశారు స్టార్ హీరో విజయ్ సేతుపతి. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి విడుదల చేస్తూ చిత్రబృందానికి విషెష్ తెలియజేశారు. ఈ ఫస్ట్ లుక్ లో అమృత అయ్యర్ వైట్ ఎత్నిక్ వేర్‌లో మీనాక్షిగా పోస్టర్‌లో మిరుమిట్లు గొలుపుతుండగా, నేపథ్యం విజువల్ ఫీస్ట్‌గా ఉంది. ఆమె చిన్న పడవలో ప్రయాణిస్తుండగా, చేపలు పక్షుల్లా ఎగురుతూ ఫాంటసీ లోకాన్ని చూపిస్తున్నాయి. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

https://twitter.com/VijaySethuOffl/status/1470258452194742272?s=20