Rajinikanth And Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు హీరోలుగా వెలుగొందారు. ముఖ్యంగా రజనీకాంత్ లాంటి నటుడు కెరియర్ మొదట్లో చిన్న చిటిక పత్రాలను చేస్తూ స్టార్ హీరో గా మారాడు. ప్రస్తుతం 74 సంవత్సరాల వయసులో కూడా అలవోకగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు… తన చివరి శ్వాస వరకు సినిమా ఇండస్ట్రీకి పరిమితం అవుతానని చెప్పిన రజనీకాంత్ ఇప్పటికి నిత్య యవ్వనుడిలా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యాంగ్ హీరోలతో సైతం పోటీపడేలా ఫైట్లను చేస్తూ ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన కూలీ విజయం సాధించకపోయినప్పటికి రజినీకాంత్ కి మాత్రం చాలా గొప్ప గుర్తింపైతే వచ్చింది. ఇక ఈ సంవత్సరం జైలర్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు…రజనీకాంత్ కి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది…
ఇక రజనీకాంత్ తర్వాత తమిళనాడులో సూపర్ స్టార్ గా విలుగొందిన వాళ్ళలో విజయ్ ఒకరు… ప్రస్తుతం విజయ్ కి రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ లేదనే చెప్పాలి. రజినీకాంత్ ఎవర్ గ్రీన్ నటుడుగా నిలిచిపోయాడు. మరియు ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకున్న నటుడిగా పేరుగాంచాడు. అలాంటి రజినీకాంత్ తో మనం విజయ్ ని పోల్చడం చాలా కష్టమని కొంతమంది చెబుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో సైతం వీళ్లిద్దరి లో ఎవరికి ఎక్కువ అభిమానులు ఉన్నారంటూ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. మొత్తానికైతే రజనీకాంత్ కి చాలా ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో కొంతమంది విజయ్ కి కూడా ఉన్నారని ఇప్పుడున్న జనరేషన్లో విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉన్నప్పటికి అది రజనీకాంత్ ను బీట్ చేసే రేంజ్ లో లేదని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక విజయ్ కొత్తగా రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం మనకు తెలిసిందే…
ఇక సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న ‘జన నాయగన్’ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేశాడు. మొత్తానికైతే జన నాయగన్ సినిమా అతని చివరి సినిమా కావడంతో అతని అభిమానులు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ పాలిటిక్స్ లో ఏ మేరకు రాణిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…