Pawan Kalyan Suswagatham: కళ్యాణ్ బాబు గా ఉన్న తన పేరు ను సినిమాల కోసం పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నాడు. ఒకప్పుడు సినిమాలంటే ఇష్టం లేని తను ఇప్పుడు స్టార్ హీరోగా అవతరించాడు. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులకు తనను చాలా గొప్పగా పరిచయం చేశాయి. ముఖ్యంగా తనలోని పవర్ స్టార్ ను మనకు పరిచయం చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. 10 సంవత్సరాలపాటు తనకు ఒక్క సక్సెస్ లేకపోయిన కూడా ఇండస్ట్రీలో తన మనగడ ను కొనసాగిస్తూ వచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి ఆయన చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు… గత సంవత్సరం ఓజీ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ తన కెరియర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు మంచి విజయాలుగా నిలిచాయి.
ముఖ్యంగా సుస్వాగతం సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉందని విమర్శకుల నుంచి ప్రశంసలైతే దక్కాయి. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా కథను విన్నప్పుడు తను ఈ సినిమాను చేయనని తనకసలు సినిమాలంటే ఇష్టం కూడా లేదని పలు సందర్భాల్లో కొంతమంది ఫ్రెండ్స్ తో చెప్పారట. ఇక ఈ విషయం చిరంజీవి భార్య అయిన సురేఖ దగ్గరికి వెళ్లిందట.
సురేఖ పవన్ కళ్యాణ్ ని పిలిపించుకొని మరి ఇది మీ అన్నయ్య పరువు సంబంధించిన విషయం కాబట్టి నువ్వు పక్కాగా సినిమా చేయాలి. సక్సెస్ సాధించాలి అని చెప్పడంతో పవన్ కళ్యాణ్ తప్పనిసరి పరిస్థితుల్లో సుస్వాగతం సినిమాని ఒప్పుకొని ఆ సినిమాని చేశారట.
ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పవన్ కళ్యాణ్ కి భారీ గుర్తింపైతే వచ్చింది. తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తను రాజకీయ ప్రవేశం చేయడానికి కూడా సినిమా అనేది చాలా వరకు హెల్ప్ అయ్యింది. సినిమా ద్వారా సంపాదించుకున్న అభిమానులనే తన పార్టీ కి కార్యకర్తలుగా మార్చుకోగలిగాడు అంటే అది కేవలం సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కి దక్కిన గుర్తింపనే చెప్పాలి…