Rajinikanth And Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు… రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవిని అభిమానించని ప్రేక్షకులు ఉండరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కెరియర్ స్టార్టింగ్ లోనే వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించిన చిరంజీవి ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ తగ్గకుండా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతుండటం విశేషం… ఆయన నుంచి వచ్చిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రేక్షకులందరు అతన్ని స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం… తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిన రజనీకాంత్ వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. మొత్తానికైతే రజనీకాంత్ తమిళ్ హీరో అయినప్పటికి అతని సినిమా రిలీజైతే మాత్రం ఆయన సినిమాలకు తెలుగులో భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అందువల్లే రజనీకాంత్ కు తెలుగులో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక చిరంజీవి – రజనీకాంత్ ఇద్దరు కలిసి కెరియర్ స్టార్టింగ్ లో ఒకటి రెండు సినిమాల్లో నటించినప్పటికి వీళ్ళు స్టార్ హీరోలు అయిన తర్వాత మాత్రం ఒక్క సినిమాలో కూడా కలిసి నటించారు… 1999వ సంవత్సరంలో వచ్చిన స్నేహం కోసం సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటించాలనే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు.
రజనీకాంత్ కి అత్యంత ఆప్తుడు అయిన కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో చిరంజీవి ‘స్నేహం కోసం ‘ సినిమా చేశాడు.కాబట్టి ఈ సినిమాలో విజయ్ కుమార్ పోషించిన పాత్రలో రజనీకాంత్ ఉంటే బాగుంటుందని కే ఎస్ రవికుమార్ భావించినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఏది ఏమైనా కూడా ఆ పాత్రను రజనీకాంత్ చేసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది.
మొత్తానికైతే చిరంజీవి – రజనీకాంత్ కాంబినేషన్లో రావాల్సిన ఒక మంచి సినిమా మిస్ అయిందనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటిస్తే ఆ ఫ్రెండ్షిప్ మధ్య ఉన్న బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉండేది. సినిమా స్క్రీన్ మీద కూడా అది భారీగా ఎలివేట్ అయ్యేది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…