Childhood Photo : సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటుల పుట్టినరోజు వచ్చిందంటే చాలు వాళ్లకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతాయి. రీసెంట్ గా ఓ ఇద్దరు హీరోల చిన్ననాటి ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాలలో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న ఈ ఇద్దరు అబ్బాయిలు ఎవరో చెప్పగలరా. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వారు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ ఇద్దరు అన్నదమ్ములకు బాగా క్రేజ్ ఉంది. ఈ ఇద్దరిలో ఒక హీరో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. మరొక హీరో తన అద్భుతమైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. వీరిద్దరూ కోలీవుడ్ హీరోలు అయినా కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ ఇద్దరికీ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఇద్దరి సినిమాలకు థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోతాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు వీరు నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో డబ్ అవుతుంది.
Also Read : ఆ పని చేసినందుకు పచ్చి బూతులు తిట్టారు, బిగ్ బాస్ ప్రియాంక ఓపెన్ కామెంట్స్
తెలుగులో కూడా వీరిద్దరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి.ఇద్దరు హీరోలు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరూ అన్నదమ్ములు మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య మరియు కార్తీ. మే 29న హీరో కార్తీ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సీని ప్రముఖులతోపాటు అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా కార్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే సూర్య, కార్తీక్ చిన్నప్పుడు కలిసి ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. కార్తీ యుగానికి ఒక్కడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు. ఇక తర్వాత ఆవారా, నా పేరు శివ, శకుని, చెలియా, దొంగ, ఊపిరి, ఖైదీ, సర్దార్, సత్యం సుందరం వంటి పలు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకున్నాడు.
యుగానికి ఒక్కడు సినిమాతో కార్తీకి టాలీవుడ్ లో అంతగా గుర్తింపు రాకపోయినా కూడా ఆ తర్వాత వచ్చిన ఆవారా సినిమాతో బాగా ఫేమస్ అయ్యాడు. ఆవారా సినిమాలో హీరో కార్తీకి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఆవారా సినిమాలోని పాటలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఆవారా సినిమాతో తెలుగులో కార్తీ సినిమాలకు క్రేజ్ బాగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కార్తీ నటించిన ప్రతి సినిమా కూడా కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. మే 29న హీరో కార్తీ పుట్టినరోజు సందర్భంగా సామాజిక మాధ్యమాలలో హీరోకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది.
We at @Prince_Pictures wish the stellar actor and our dearest @Karthi_Offl sir a very happy birthday.#Sardar2@ivyofficial2023 @Psmithran @iam_SJSuryah @lakku76 @venkatavmedia @RajaS_official @B4UMotionPics @MalavikaM_ @AshikaRanganath @rajishavijayan @iYogiBabu @SamCSmusic… pic.twitter.com/AfT5nabrG7
— Prince Pictures (@Prince_Pictures) May 25, 2025