https://oktelugu.com/

Rajini Kanth: రికార్డు లెవెల్లో ఓవర్సీస్ లో విడుదల అవుతున్న రజినీకాంత్ ” పెద్దన్న”…

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూపర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనే చెప్పాలి. దీపావళి నవంబర్ 4 వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే రజిని సినిమా అంటే అదో పండగ వాతావరణం అనే చెప్పాలి. సూపర్ స్టార్ సినిమా సంధర్భంగా సెలవు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 / 12:25 PM IST
    Follow us on

    Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సూపర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనే చెప్పాలి. దీపావళి నవంబర్ 4 వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే రజిని సినిమా అంటే అదో పండగ వాతావరణం అనే చెప్పాలి. సూపర్ స్టార్ సినిమా సంధర్భంగా సెలవు ప్రకటించిన ధాతనాలు కూడా ఉన్నాయి. రజినీకాంత్ సినిమాకి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.

    శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను… సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించనుంది.ఈ మేరకు విదేశాల్లో కూడా భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కరోనా తర్వాత విదేశాల్లో 1100 పైగా స్క్రీన్స్‌లో విడుదలవుతున్న మొదటి చిత్రం ’అన్నాత్తే’ కావడం విశేషం. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ’పెద్దన్న’ కూడా విదేశాల్లో భారీ ఎత్తున విడుదలవుతోంది. తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్ రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఈ  సినిమాలో రజినీ ఇంట్రో సాంగ్ ను దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పడడం విశేషం. రజినీ నటించిన ఎన్నో సినిమాలకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. ఈ సినిమాతో రజినీకాంత్ ప్రెషకులను మెప్పిస్తారో తెలియాలంటే రేపటి వరకు ఆగక తప్పదు.