Rajini Kanth: రజినీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన మిత్రుడు… రాజ్ బహదూర్

Rajini Kanth: సూపర్​స్టార్ రజనీకాంత్​కు ఉన్న ఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రసీమకు ఆయన చేసిన సేవకుగానూ… దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డుతో కేంద్రం ఇటీవలే ఆయన్ను సత్కరించింది. ఆ అవార్డును తన మిత్రుడు రాజ్ బహదూర్​కు అంకితమిస్తున్నట్లు రజనీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. రజినీ సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో కండక్టర్​గా పనిచేశారు. ఆ బస్సుకు డ్రైవరే రాజ్ బహదూర్…  అప్పుడు మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ […]

Written By: Sekhar Katiki, Updated On : October 27, 2021 2:26 pm
Follow us on

Rajini Kanth: సూపర్​స్టార్ రజనీకాంత్​కు ఉన్న ఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రసీమకు ఆయన చేసిన సేవకుగానూ… దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డుతో కేంద్రం ఇటీవలే ఆయన్ను సత్కరించింది. ఆ అవార్డును తన మిత్రుడు రాజ్ బహదూర్​కు అంకితమిస్తున్నట్లు రజనీ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. రజినీ సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో కండక్టర్​గా పనిచేశారు. ఆ బస్సుకు డ్రైవరే రాజ్ బహదూర్…  అప్పుడు మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజ్ బహదూర్… రజిని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రజనీకాంత్​ మాతో కలిసి కండక్టర్​గా పనిచేసే రోజుల్లో మేమంతా నాటకాలు వేసేవాళ్లం. రజనీ ప్రధాన పాత్రల్లో బాగా నటించేవాడు. అతడి ప్రతిభ చూసి, సినిమాల్లోక వెళ్లమని… గొప్ప నటుడివి అవుతావని చెప్పాను. చెన్నై ఫిల్మ్​ ఇన్​స్టిట్యూట్​లో చేరమని సల్హ ఇవ్వగా… అలా రెండేళ్ల పాటు రజనీ శిక్షణ తీసుకున్నాడు. అనంతరం రజనీ ఓ నాటకం వేయగా.. అది చూడటానికి వచ్చిన ప్రముఖ దర్శకుడు బాలచందర్​…  సూపర్​స్టార్​ నటనకు ఫిదా అయ్యారని రాజ్ తెలిపారు.

బాల చందర్ తమిళం నేర్చుకోమని సలహా ఇవ్వడంతో… అప్పుడు మేమిద్దరం తమిళంలో మాట్లాడటం ప్రారంభించాం అన్నారు. రెండు నెలల్లోనే రజనీ పూర్తిగా తమిళం నేర్చుకున్నాడు. ఆ తర్వాత బాలచందర్ దగ్గరకు వెళ్లాడని… అలా రజినికి అపూర్వ రాగంగళ్​లో అవకాశం వచ్చిందని రాజ్​ బహదూర్​ చెప్పారు. కాగా రజనీకాంత్​ నటించిన ” అన్నాత్తే ” సినిమా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, టీజర్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.