Rajendra Prasad Jathara Pre Release Event: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) నటించిన ‘మాస్ జాతర'(Mass Jathara Movie) చిత్రం నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక రోజు ముందు గానే అనగా అక్టోబర్ 31 న సాయంత్రం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. ఈ సందర్భంగా నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ కి తమిళ హీరో సూర్య ముఖ్య అతిథి గా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడిన మాటలకు ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఇది కదా సూర్య క్రేజ్ అంటే అని అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ లో సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ స్పీచ్ స్పెషల్ హైలైట్ గా నిల్చింది.
ఈమధ్య కాలం లో రాజేంద్ర ప్రసాద్ ప్రసంగాలు చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. ఒక్కోసారి ఆయన మాటలు వివాదాలకు దారి తీసింది. ఎంతలా అంటే ఆయన్ని ఎంతగానో అభిమానించే అభిమానులు కూడా రాజేంద్ర ప్రసాద్ కి సంస్కారం లేదంటూ తిట్టారు. అంత వైరల్ అయ్యాయి ఆయన మాటలు. అందుకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘నేను ఇప్పటి వరకు 300 సినిమాలు చేసి ఉంటాను. ఆ అనుభవం తో చెప్తున్నాను. ఈ సినిమా ని చూసి మీరంతా షాక్ కి గురి అవ్వకపోతే నేను సినిమాల నుండి తప్పుకుంటాను. అంతే కాదు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా అభినందిస్తుంది. అందుకు నేను గ్యారంటీ ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు రాజేంద్ర ప్రసాద్.
అయితే ఆయన మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని నెటిజెన్స్ అంటున్నారు. ఎందుకంటే నితిన్ రాబిన్ హుడ్ మూవీ విడుదలకు ముందు కూడా రాజేంద్ర ప్రసాద్ ఇదే తరహా కామెంట్స్ చేసాడు. కానీ ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. మాస్ జాతర కూడా అదే రేంజ్ లో ఫ్లాప్ అవ్వుదేమో అని అనుకునేవాళ్లు కొంతమంది ఉన్నారు. అలా కాకుండా రవితేజ, రాజేంద్ర ప్రసాద్ లది సూపర్ హిట్ కాంబినేషన్, గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘రాజా ది గ్రేట్’ చిత్రమొచ్చి భారీ కమర్షియల్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుందని అనుకునేవాళ్లు ఉన్నారు. కానీ ఎవరి నమ్మకం నిజం అవుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.
