Rajendra prasad- Anchor Manjusha: తెలుగు తెరల పై బోల్డ్ యాంకర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ.. వారిలో యాంకర్ మంజూష శైలి వేరు. పోటీగా ఎంతమంది భామలు ఉన్నా.. కొత్తగా వస్తున్నా.. మంజూష రాగం.. తాళం వేరు. అందుకే, మంజూష ఒక్క ఫోటో షూట్ చేస్తే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అసలు మంజూష అలా హస్కీ లుక్స్ లో కైపుగా చూస్తే.. హీరోయిన్లు కూడా దిగదుడుపే.
మరి అలాంటి అందాల మంజూష పై ఎవరైనా సీరియస్ అవుతారా ?, పైగా స్టేజ్ పైనే అందరి ముందు అవమానిస్తారా ?, కానీ.. అవమానించారు. నట కిరిటీ రాజేంద్రప్రసాద్ ఆమెను విసుక్కున్నాడు. అందరి ముందు ఆమె పై పెదవి దాటాడు. దాంతో మంజూష ఫీల్ అయిపోయింది. ఎఫ్ 3 సక్సెస్ కి సంబంధించిన వేడుక పై ఇదంతా జరిగింది. ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వచ్చింది మంజూష.
Also Read: Pawan Kalyan Apologizes To Prabhas: ప్రభాస్ కి పవన్ కళ్యాణ్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా..?
రాజేంద్ర ప్రసాద్ ఏదో మాట్లాడటానికి స్టేజ్ పైకి వచ్చాడు. అయితే, ఈ లోపు మంజూష ఆయనను ఎదో అడిగే ప్రయత్నం చేసింది. దీంతో, ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ ఆమెపై విరుచుకు పడ్డాడు. ‘ఉండమ్మ నీతోని..’ అంటూ విసుకుంటూ.. ‘మేం ఏదో మాట్లాడానికి వస్తే.. నువ్వేంటి ?’ అంటూ.. మంజూష పై తెగ సీరియస్ అయ్యిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ అంతే.. కొంచెం అతి చేస్తుంటాడు.
కానీ, ఈ అతికి మంజూష బలి కావడమే కొసమెరుపు. పైగా రాజేంద్ర ప్రసాద్ అందరి ముందు.. ‘మా గోలే సరిపోదంటే నీ గోల ఒకటి ?’ అన్నారు. ఈ మాటకు మంజూష వెంటనే.. మొఖం చిన్నబుచ్చుకుంది. బాధగా స్టేజ్ దిగి పక్కకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ ఫేస్‌బుక్, సోషల్ మీడియా బాగా వైరల్ గా మారింది.
ఇంత హడావుడి చేసిన రాజేంద్ర ప్రసాద్ ఇంతకీ ఏమి మాట్లాడాడు అంటే.. ఆయన మాటల్లోనే.. ‘ఎఫ్3 సినిమా హిట్ అవ్వకపోతే.. నా ముఖం చూపించనన్నాను. ఇప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్. ఎఫ్3 సినిమాకు అన్నీ చోట్ల సెంటర్స్ ఫుల్ అయ్యాయన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. నవ్వు ఎవర్ గ్రీన్ అంటూ ప్రూవ్ చేసిన మా అబ్బాయి అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అంటూ రాజేంద్ర ప్రసాద్ తెగ మురిసిపోయాడు.
Also Read:Virata Parvam: ముందుగానే రాబోతున్న ‘విరాట పర్వం’.. సాయి పల్లవి స్పెషల్ ఇంటర్వ్యూలు