https://oktelugu.com/

రాజశేఖర్ సీరియస్ గా దృష్టి పెట్టాడట !

సినిమా ఇండస్ట్రీలో హీరోకు ఉండే క్రేజ్ మరో ఏ వ్యక్తికీ ఉండదనేది నిజం. అందుకే సీనియర్ హీరో డా. రాజశేఖర్ కూడా హీరోగానే కొనసాగడానికి ఇంకా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ హిట్ తో తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని ఇంకా చూపించే ప్రయత్నం బలంగానే చేస్తున్నాడు. షూటింగ్స్ పర్మిషన్ ఇవ్వడంతో ప్రస్తుతం తన తరువాత సినిమా పై చాల సీరియస్ గా దృష్టి పెట్టాడట ఈ సీనియర్ హీరో. ‘పూలరంగడు, అహన […]

Written By:
  • admin
  • , Updated On : June 17, 2020 / 10:03 AM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో హీరోకు ఉండే క్రేజ్ మరో ఏ వ్యక్తికీ ఉండదనేది నిజం. అందుకే సీనియర్ హీరో డా. రాజశేఖర్ కూడా హీరోగానే కొనసాగడానికి ఇంకా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గరుడవేగ’ హిట్ తో తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని ఇంకా చూపించే ప్రయత్నం బలంగానే చేస్తున్నాడు. షూటింగ్స్ పర్మిషన్ ఇవ్వడంతో ప్రస్తుతం తన తరువాత సినిమా పై చాల సీరియస్ గా దృష్టి పెట్టాడట ఈ సీనియర్ హీరో. ‘పూలరంగడు, అహన పెళ్ళంట’ చిత్రాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి దర్శకత్వంలో సరికొత్త తరహా కథాంశంతో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్నారు.

    కాగా ఈ సినిమా షూటింగ్ జూలై ఫస్ట్ వీక్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఎమోషనల్గా సాగే ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నారట. ముఖ్యంగా రాజశేఖర్ పాత్రకు మరియు రాజశేఖర్ కూతురు పాత్రకు మధ్య మంచి సెంటిమెంట్ ఉంటుందని.. సినిమాలో ఆ సెంటిమెంట్ నే హైలైట్ అవ్వబోతుందని.. అయితే ఈ సినిమాకు ఇంగ్లీష్ సినిమా ‘టోకెన్’ ప్రేరణ అని, ఆ సినిమాలోని మెయిన్ పాయింట్ ఆధారంగానే ఈ చిత్రం స్క్రిప్ట్ రాసుకున్నారని తెలుస్తోంది.

    ఇక రాజశేఖర్ గరుడవేగ, కల్కి లాంటి సినిమాలు తర్వాత నటిస్తుండటంతో ఈ చిత్రం పై సహజంగానే కొంతవరకు అంచనాలు ఉండొచ్చు. అయితే దర్శకుడు వీరభద్రం చౌదరి ట్రాక్ రికార్డ్, ఆయన గత సినిమా ఫలితం దృష్టిలో పెట్టకుంటే ఈ చిత్రానికి అది మైనస్ గా నిలిచే అవకాశం ఉంది. మరి రాజశేఖర్ కి ఈ చిత్రం ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.