Rajasekhar Saved Sunil Daughter Life: హీరో గా దశాబ్దాల పాటు ఆడియన్స్ ని అలరించిన రాజశేఖర్ , ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈయన కెరీర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మొదలైంది. కెరీర్ ప్రారంభం లో విలన్ క్యారెక్టర్స్ కూడా చాలానే చేశాడు. అయితే ఈయన హీరో అవ్వడానికంటే ముందు ఒక గొప్ప డాక్టర్. ఎంత గొప్ప డాక్టర్ అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనుషులను కూడా కాపాడగలడు. అలా ఇండస్ట్రీ లో ఎంతో మందికి ఆపరేషన్స్ చేసిన ఘనత కూడా రాజశేఖర్ సొంతం. సినీ ఇండస్ట్రీ లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేకుండా వచ్చినా, రాజశేఖర్ వద్దకు వెళ్లేవారు అట. డాక్టర్ గా ఇండస్ట్రీ లో ఆయనకు ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రాజశేఖర్ ఒక ఆసక్తి కర్మణా విషయాన్ని పంచుకున్నాడు.
ప్రముఖ కమెడియన్ సునీల్ కి ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఈ చిన్నారి కొన్నేళ్ల క్రితం తీవ్రమైన అస్వస్థతకు గురైందట. పరిస్థితి విషమించడంతో ఆమెని రాజశేఖర్ వద్దకు తీసుకొని రాగా, ఆయన ఆమెకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, ఒక ఇంజక్షన్ కూడా ఇచ్చాడట. దీంతో సునీల్ కూతురు అతి తక్కువ సమయం లోనే ప్రాణాపాయ స్థితి నుండి బయట పడింది. ఈ విషయాన్ని రాజశేఖర్ రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ కృతజ్ఞతతో సునీల్ కుటుంబం ప్రతీ ఏడాది ఒక రోజు రాజశేఖర్ ఫ్యామిలీ తో గడిపేందుకు వాళ్ళ ఇంటికి వస్తారట. దీనిని బట్టీ రాజశేఖర్ ఎంత గొప్ప వైద్యుడో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రావడం వల్ల, సమాజానికి ఒక్క గొప్ప డాక్టర్ మిస్ అయ్యాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే రాజశేఖర్ రీసెంట్ గానే శర్వానంద్ హీరో గా నటించిన ‘బైకర్’ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి గొప్ప పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే అందుకు రాజశేఖర్ క్యారెక్టర్ కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. హీరో పాత్రలకు స్వస్తి పలికి క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యినప్పుడు , రాజశేఖర్ నుండి వచ్చిన మొట్టమొదటి చిత్రమిది. ఇక రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి క్యారెక్టర్స్ చేయబోతున్నాడో చూడాలి. మధ్యలో మంచి కథ దొరికితే హీరో రోల్స్ చేయడానికి కూడా ఆయన సిద్దంగానే ఉన్నాడట. రాజశేఖర్ లాంటి గొప్ప నటులు ఇలా అన్ని పాత్రలు చేయడానికి అందుబాటులోకి రావడం డైరెక్టర్స్ కి పెద్ద అదృష్టం అనే చెప్పాలి.