Rajasekhar And Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే వారసత్వం ఉంటే సరిపోదు. మనలో టాలెంట్ ఉండాలి, అంతకు మించి పోరాడగలిగే తెగింపు ఉండాలి. దేనికైనా సరే ఓర్చుకొని నిలబడగలిగే ధైర్యం ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ లను సాధిస్తారు. ఈరోజు వచ్చి రేపు సక్సెస్ అవుతాం అంటే కుదరదు. కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అవకాశం వచ్చినా కూడా గుర్తింపు వచ్చేంతవరకు పోరాటం చేస్తుండాలి. అలా చేసిన వాళ్లకి మాత్రమే సక్సెసులు వరిస్తాయి. వాటన్నింటిని ఓర్చుకొని సక్సెస్ ని సాధించి మెగాస్టార్ గా మారాడు. కాబట్టే చిరంజీవికి ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానమైతే ఉంది. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉన్నాడు…అలాంటి చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ సినిమాతో 400 కోట్ల క్లబ్లో చేరిపోయిన చిరంజీవి సీనియర్ హీరోలందరికంటే ముందు వరుసలో ఉన్నాడు…
చిరంజీవి టాప్ స్టార్ గా వెలుగొందుతున్న సమయంలోనే ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వకపోవడంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి తిరిగి వచ్చాడు. తను రీఎంట్రీ లో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చేశాడు. ఈ మూవీ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది.
ఈ సినిమాలో మొదట విలన్ గా రాజశేఖర్ ని తీసుకోవాలని దర్శకుడు అనుకున్నాడట. కానీ రాజశేఖర్ అయితే ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి రాజశేఖర్ ను రిజెక్ట్ చేసి బాలీవుడ్ నటుడిని తీసుకోమని డైరెక్టర్ కి చెప్పాడట. రాజశేఖర్ ప్లేస్ లో బాలీవుడ్ నటుడు వచ్చాడు.
మొత్తానికైతే ఒక 10 సంవత్సరాల ముందే చిరంజీవి సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటించాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల అది మిస్ అయింది. ఇక మీదటైనా చిరంజీవి సినిమాలో రాజశేఖర్ విలన్ గా చేసే అవకాశం ఉందా? ఒకవేళ ఆ అవకాశం వస్తే రాజశేఖర్ చిరంజీవి సినిమాలో విలన్ గా చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…