Dhurundhar Movie on OTT: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన రణవీర్ సింగ్(Ranveer Singh) ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రకంపనలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తూనే ఉంది. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. ఒక A సర్టిఫికేట్ సినిమా, బాలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఊహించలేదు. అయితే మూవీ లవర్స్ లో ఉన్న అతి పెద్ద నిరాశ ఈ సినిమా ఇతర భాషల్లో విడుదల కాకపోవడమే.
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఒక సినిమాని , తాము కూడా చూడాలనే కోరిక మూవీ లవర్స్ లో ఉంటుంది కదా?, ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ అయితే ఇలాంటి సినిమాలను ఆదరించడం లో ముందు ఉంటారు. తెలుగు వెర్షన్ ని థియేటర్స్ లో విడుదల చేస్తారని అనుకున్నారు కానీ చేయలేదు. అయితే ఓటీటీ లో మాత్రం తెలుగు తో పాటు, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల డబ్ చేసి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. నెట్ ఫ్లిక్స్ సంస్థ, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 286 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఈ నెల 30 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
ఇకపోతే ఈ చిత్రం ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 30 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 273 కోట్ల రూపాయిలు అన్నమాట. రాబోయే రోజుల్లో ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ మార్కు ని అందుకోనుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను ఇచ్చే ప్రాంతం మిడిల్ ఈస్ట్. కానీ ఈ చిత్రాన్ని అక్కడ విడుదల కానివ్వకుండా బ్యాన్ చేశారు. అయినప్పటికీ కూడా ఓవర్సీస్ లో ఈ రేంజ్ గ్రాస్ రాబట్టిందంటే ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి 5 వ వీకెండ్ లో 36 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మొత్తం మీద ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 820 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 900 కోట్ల మార్కుని కూడా అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.