Rajasaab Movie : అన్ని అనుకున్నట్టు పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం జరిగి ఉండుంటే, ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Raja Saab Movie) మూవీ మేనియా ఈపాటికి ప్రారంభం అయిపోయి ఉండేది. ఈ సినిమాని ముందుగా ఏప్రిల్ 10 న విడుదల చేద్దాం అనుకున్నారు. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయిపోయినప్పటికీ, గ్రాఫిక్స్ వర్క్ ఇంకా చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో ఈ సినిమా సమ్మర్ రేస్ నుండి తప్పుకుంది. ఈ ఏడాది చివర్లో అయినా విడుదల అవుతుందా లేదా అనేది తెలియట్లేదు. ఎందుకంటే ఇందులో గ్రాఫిక్స్ అత్యంత కీలకం. హై రేంజ్ క్వాలిటీ వచ్చే వరకు ప్రభాస్ అసలు తగ్గట్లేదట. రీసెంట్ గా ఈ సినిమాని ఆయన వీక్షించి గ్రాఫిక్స్ తన అంచనాలకు ఇంకా రీచ్ కాలేదని, హై క్వాలిటీ వచ్చే వరకు విడుదల తేదీని ప్రకటించవద్దని మేకర్స్ కి చెప్పాడట. దీంతో ఇప్పుడు గ్రాఫిక్స్ పై మళ్ళీ రీ వర్క్ చేస్తున్నారు.
Also Read : రాజాసాబ్ సినిమా రిలీజ్ డేట్ కి రావడం కష్టమేనా..?
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి రెండు కీలకమైన ట్విస్టులు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయిపోయాయి. గ్లిమ్స్ వీడియో లో మనం ప్రభాస్ కింగ్ అవతారం లో కుర్చీలో కూర్చొని నోట్లో సిగార్ పెట్టుకొని స్టైల్ గా కనిపించిన పాత్ర పేరు ఠాకూర్ సాబ్ అట. ఈ పాత్ర ప్రస్తుత కాలం లో ఉండే రాజా సాబ్ క్యారక్టర్ కి తండ్రి అన్నమాట. అంతే కాకుండా ఆ కోటకు యజమాని కూడా. ఇకపోతే ప్రభాస్ కి తాత పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఆయనది కూడా దెయ్యం క్యారక్టర్ అట. ఇలా ఈ ముగ్గురి మధ్య సాగే స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan) నటిస్తున్నారు. నిధి అగర్వాల్ రీసెంట్ గా జరిగిన అన్ని ఇంటర్వ్యూస్ లో ‘రాజా సాబ్’ లో నా క్యారక్టర్ ని చూసి అందరూ షాక్ కి గురి అవుతారు అంటూ చెప్పుకొచ్చింది.
ఆమె అంతలా చెప్తుందంటే, ఈ సినిమాలో ఆమె దెయ్యం క్యారక్టర్ చేస్తుందా అని సోషల్ మీడియా లో అభిమానులు అడగగా, కాదని చెప్పింది. కానీ నా క్యారక్టర్ ఇచ్చే ట్విస్ట్ కి థియేటర్స్ లో ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి అని చెప్పుకొచ్చింది. ఇంతలా చెప్తుందంటే, ఇందులో ఆమె విలన్ క్యారక్టర్ చేస్తుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఒక్క డైరెక్టర్ కూడా ప్రభాస్ కామెడీ టైమింగ్ ని పూర్తిగా వాడుకోలేదు. కానీ ‘రాజా సాబ్’ లో మాత్రం ప్రభాస్ కామెడీ టైమింగ్ కి పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకుంటారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.
Also Read : జపాన్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దేవర’ సాంగ్..వైరల్ అవుతున్న వీడియో!