Rajamouli-Mahesh Babu: తెలుగు సినిమా చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేనిది ఎప్పుడూ కానరాని విధంగా పాన్ ఇండియా సినిమాలు వరుసగా తెరకెక్కుతున్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెరిగింది. ప్రపంచ సినీ లోకంలో రాజమౌళి అనే దర్శకుడికి ఒక గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ మీడియా వేదికగా రాజమౌళి ఈ చిత్రం పై క్లారిటీ ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ముగిసిన తర్వాతనే మహేష్ సినిమాను స్టార్ట్ చేస్తానని తెలియజేశాడు. అంటే, ఆర్ఆర్ఆర్ సినిమా లెక్కల తాలూకు వ్యవహారాలు పూర్తి అవ్వడానికి ఎలాగూ మరో రెండు మూడు నెలలు పడుతుంది.
ఆ లెక్కన రాజమౌళి మాటలను బట్టి.. మహేష్ తో రాజమౌళి సినిమా మార్చి నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పై ఇప్పటికే అనేక రూమర్స్ వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ విషయంలో చాలా విషయాలు వైరల్ అయ్యాయి. వాటిల్లో ప్రధానంగా ఇదే ఈ సినిమా కథ అంటూ వచ్చిన వార్త బాగా నమ్మశక్యంగా ఉంది.
Also Read: ప్రెస్ మీట్ లో షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి… చరణ్, తారక్ వల్లే ఆర్‌ఆర్‌ఆర్ లేట్ అయ్యిందంటూ
ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన కథను రాశాడట. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో కథ ఉంటుంది. అంటే.. ఆ ఫారెస్ట్ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుంది. అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారు. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి.. ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారు. క్లుప్తంగా చెప్పుకుంటే ఈ సినిమా కథ ఇదే. కాకపోతే.. ఫారెస్ట్ లో జరిగే యాక్షన్ ఎడ్వెంచరెస్ సీన్లు అద్భుతంగా ఉంటాయట.
ఎలాగూ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించడంలో రాజమౌళి ని మించినోళ్ళు లేరు. కాబట్టి.. సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం ఇండియన్ సినిమాకి పూర్తిగా కొత్త నేపథ్యం. ఇంతవరకు భారతీయ సినీ చరిత్రలో ఆ నేపథ్యంలో సినిమా రాలేదు. ఇప్పుడు మహేష్ చేస్తే.. కచ్చితంగా ఇండియా వైడ్ గా ఈ సినిమా పై ఆసక్తి ఉంటుంది.
Also Read: అక్కడి ప్రశ్నలు ఇక్కడ వద్దంటూ మీడియా పై సెటైర్లు వేసిన జక్కన్న…