Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న సినిమా పుష్ప. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ప్రకటించిన మొదటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీజర్, పోస్టర్లు, పాటలు రిలీజ్ చేసి.. అందుకు తగ్గ హైప్‌ను పెంచారు మేకర్స్.
సాధారణంగా సుకుమార్- అల్లు అర్జున్ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఆర్య, ఆర్య2 సినిమాల్లో బన్నీని కొత్తగా చూపించడమే అందుకు కారణం. మరోవైపు రంగస్థలంతో ఫుల్‌ఫామ్‌లోకి వచ్చి సుకుమార్.. ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకోవాలని బలంగా అనుకంటున్నట్లు కనిపిస్తోంది.
ఇక సుకుమార్- దేవి శ్రీ కాంబోలో వచ్చే సినిమాలో ఐటెం సాంగ్ కూడా స్పెషల్‌గానే ఉంటుంది. ఈ క్రమంలోనే పుష్పలోని ఐటెం సాంగ్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామ పేరుతో వచ్చిన ఈ సాంగ్‌లో సమంత తన అందాలు ఆరబోస్తూ.. హాట్ లుక్స్‌తో కవ్వించనున్నట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం విడుదలైన ఈ పాట.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విడుదలైన 12 గంటల్లోనే 8 మిలియన్ వ్యూస్‌కు చేరుకుంది. ప్రస్తుతం 10 మిలియన్స్ చేరువలో దూసుకెళ్లిపోతోంది. దీంతో దేవిశ్రీ తన మ్యూజిక్‌తో మరోసారి మాయ చేశారనే చప్పాలి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Pushpa item song going to reach 10 milion views
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com