https://oktelugu.com/

Sukumar: రాజమౌళి చేయాల్సిన సినిమా సుకుమార్, సుకుమార్ కథ తో రాజమౌళి సినిమా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

సుకుమార్ రాసుకునే ప్రతి సీన్ లో లాజిక్ గా ఉంటుంది అందుకోసమే సుకుమార్ ను లాజిక్కుల డైరెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో ఉన్న ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 సినిమా పైననే తన దృష్టి మొత్తానికి కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 17, 2024 / 08:03 AM IST
    Follow us on

    Sukumar: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమం లో ఆర్య సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆధారణ ను కూడా పొందాడు. ఇక ఇదిలా ఉంటే వరుస సినిమాలు చేస్తూ మంచి ఫాలోయింగ్ ను సంపాదిస్తున్న డైరెక్టర్ లలో సుకుమార్ లాంటి దర్శకుడు ఇండస్ట్రీ లో మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం. ఇంటలిజెంట్ తో సినిమాలు చేస్తూ సక్సెస్ లు అందుకోవడం అంటే అంత మామూలు విషయం కాదు.

    కమర్షియల్ సినిమాలు చేయడం ఈజీనే కానీ ఆ కమర్షియల్ సినిమాలోనే మన ఐక్యూ లెవల్ని పరీక్షిస్తూ ఎక్స్పరిమెంట్లు చేస్తూ ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతూ ఉంటాయి. ఇక పాన్ ఇండియా లో తోపు డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి అన్ని విషయాల్లో సుకుమార్ కంటే ముందున్నప్పటికీ ఐక్యూలో గాని, లాజికల్ సీన్స్ ని క్రియేట్ చేయడంలో గాని సుకుమార్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడనే చెప్పాలి.

    సుకుమార్ రాసుకునే ప్రతి సీన్ లో లాజిక్ గా ఉంటుంది అందుకోసమే సుకుమార్ ను లాజిక్కుల డైరెక్టర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలో ఉన్న ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 సినిమా పైననే తన దృష్టి మొత్తానికి కేంద్రీకరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో కనుక ఆయన సూపర్ సక్సెస్ ని అందుకుంటే ఆయన కెరియర్ లో టాప్ ప్లేస్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు అనే చెప్పాలి…

    ఇక ప్రస్తుతం ఆయన డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ లను అందుకొని టాప్ రేంజ్ లో ఉన్నాడు…ఇక రాజమౌళి కూడా ప్రస్తుతం మహేష్ బాబు తో చేసే సినిమాతో పాన్ వరల్డ్ లో ఒక సూపర్ సక్సెస్ ను సాధించడానికి రెఢీ అవుతున్నాడు.ఇక ఈ ఇద్దరు డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా డైరెక్టర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇది ఇలా ఉంటే సుకుమార్ రాసుకున్న కథతో రాజమౌళి, అలాగే రాజమౌళి చేసే కథ తో సుకుమార్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు సోషల్ మీడియా వేదిక గా వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…