Rajamouli: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు రకాల వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా కి టైటిల్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు అంటూ మరొక వార్త నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ‘మహారాజ్ ‘అనే టైటిల్ ను ఖరారు చేయబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి.
ఇక ఈ టైటిల్ ను విన్న మరి కొంతమంది రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వచ్చే పాన్ వరల్డ్ సినిమాకి ‘మహారాజ్ ‘ అనే టైటిల్ అస్సలు సెట్ అవ్వదు. వీళ్ళ కాంబో కి కొంచెం వైల్డ్ గా ఉండే పేరైతే సెట్ అవుతుంది అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ మహేష్ బాబు రాజమౌళి కాంబో మీద పాన్ వరల్డ్ లో ఇప్పటికే చర్చలు అయితే జరుగుతున్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్లను కూడా రాజమౌళి చాలా తొందరగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే సెంథిల్ కుమార్ తప్పుకోగా ఆయన ప్లేస్ లో పి ఎస్ వినోద్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వీఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ గా కమల్ కన్నన్ ను తీసుకున్నారు. ఇక దీంట్లో హీరోయిన్ గా ఇండోనేషియాకి చెందిన ‘చెల్సియా ఎలిజిబెత్ ఇస్లాన్ ‘ ని హీరోయిన్ గా, ప్రముఖ హాలీవుడ్ నటుడు అయిన ‘హెమ్స్ వర్త్ ‘ కీలక పాత్ర లో నటించబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ప్రస్తుతానికి రాజమౌళి ఈ సినిమాకి ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కంప్లీట్ చేస్తున్నాడు. మొత్తానికైతే ఈ సినిమా టైటిల్ ఏంటి అనే దానిపైన ఇప్పటివరకు వస్తున్న వార్తలకి చెక్ పెడుతూ రాజమౌళి తొందర్లోనే ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…