Rajamouli Father Vijayendra Prasad: రాజమౌళి ఈరోజు దేశం గర్వించదగ్గ సినిమాలు వరుసగా తీస్తున్నాడు అంటే దానికి ప్రధాన కారణాలలో ఒకరు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు..రాజమౌళి కెరీర్ ప్రారంభం నుండి తన తండ్రి ఇచ్చిన కథలతోనే సినిమాలను తీస్తూ వస్తున్నాడు..అవన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారి నేడు రాజమౌళి ని ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్ గా నిలబెట్టాయి..ప్రస్తుతం ఆయన రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే సినిమా స్టోరీ ని సిద్ధం చెయ్యడం లో బిజీ గా ఉన్నాడు.

ఇదంతా పక్కన పెడితే విజయేంద్ర ప్రసాద్ కేవలం రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు మాత్రమే కాదు..ఇతర దర్శకులకు కూడా తన కథలను ఎన్నో అందించాడు..బాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 5 గ్రాస్సర్స్ లో ఒకటిగా నిలిచిన సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్ సినిమాకి కూడా కథని అందించింది విజయేంద్ర ప్రసాద్ కథని అందించాడు..తెలుగు లో కూడా ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథని అందించారు..అందులో సమరసింహా రెడ్డి వంటి సినిమా కూడా ఉంది.
అయితే ప్రస్తుతం ఆయన దగ్గర 10 కథలు సిద్ధంగా ఉన్నాయట..అందులో ‘విక్రమార్కుడు 2 ‘ కూడా ఒకటి..2006 వ సంవత్సరం లో మాస్ మహారాజ రవితేజ మరియు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన విక్రమార్కుడు చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సీక్వెల్ సిద్ధం అవుతుంది అని ఎప్పటి నుండో టాక్ ఉంది..కానీ రాజమౌళి వేరే కమిట్మెంట్స్ తో బిజీ గా ఉండడం వల్ల ఈ సీక్వెల్ తెరకెక్కలేదు.

ఇప్పుడు ఈ కథని వేరే డైరెక్టర్ కి అమ్మేసాడట విజయేంద్ర ప్రసాద్..త్వరలోనే ఆ డైరెక్టర్ మాస్ మహారాజ రవితేజ తో గ్రాండ్ గా ఈ సీక్వెల్ ని తియ్యబోతున్నాడు..ఆ డైరెక్టర్ మరెవరో కాదు..రవితేజ తో కిక్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన సురేందర్ రెడ్డి అని తెలుస్తుంది..ఇది ఇలా ఉండగా విజయేంద్ర ప్రసాద్ దగ్గర మిగిలున్న 9 కథలు కూడా అమ్మెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడట.