Rajamouli and Dil Raju : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ఇప్పటివరకు చేసిన 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఆయనతో సినిమా చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ పోటీ పడుతున్నారని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఈయన ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh Babu) తో సినిమా చేస్తుండటం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న నిర్మాత దిల్ రాజు(Dil Raju)…ఒక కథను విన్నప్పుడే అది ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధిస్తుంది అని జడ్జ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్ కూడా తనే కావడం విశేషం… అందువల్లే తన బ్యానర్ లో చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక దిల్ రాజును లక్కీ హ్యాండ్ గా చాలా మంది పిలుచుకుంటూ ఉంటారు. ఒకసారి దిల్ రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే చాలు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని కాన్ఫిడెంట్ ను కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే దర్శక ధీరుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి(Rajamouli) సైతం చేసిన సినిమాలు అన్నింటిని సక్సెస్ ఫుల్ గా నిలిపి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి రాజమౌళితో దిల్ రాజు ఎందుకు సినిమా చేయలేదు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లందరితో సినిమాలను చేసిన దిల్ రాజు రాజమౌళి తో మాత్రం ఎందుకు తన సినిమాని పట్టాలెక్కించలేకపోయాడనే ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.
నిజానికి ఇంతకుముందు కూడా దిల్ రాజు చాలాసార్లు రాజమౌళితో సినిమా చేయాలని అనుకున్నారట. కానీ ఎప్పటికప్పుడు ఆ సినిమాలనేవి వాయిదా పడుతూనే వచ్చాయి. ఇక రాజమౌళికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆయన దిల్ రాజు కమిట్ అవ్వలేదట. మరి ఎట్టకేలకు వీళ్ళ కాంబినేషన్ లో తొందర్లో సినిమా రాబోతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
ఇక రీసెంట్ గేమ్ చేంజర్ (Game Changer) సినిమాతో భారీగా నష్టపోయిన దిల్ రాజు ఇక మీదట భారీ సినిమాలు చేసి ప్రసక్తే లేదు అంటూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. కాబట్టి రాజమౌళితో సినిమా చేయాలంటే మినిమం 1000 కోట్ల బడ్జెట్ అయిన పెట్టాల్సి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో దిల్ రాజు అంత పెద్ద మొత్తంలో బడ్జెట్ అయితే కేటాయించలేడు.
కాబట్టి వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా రావడం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే రాజమౌళి దాదాపు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకొని పెట్టుకున్నారు. మరి ఆ ప్రొడ్యూసర్లకు సినిమాలు చేయడానికి ఈజీగా రాజమౌళికి పది సంవత్సరాల సమయం అయితే పడుతుంది. కాబట్టి ఇప్పుడప్పుడే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలైతే లేవు…