Adipurush Rajamouli: ఆదిపురుష్ మూవీ హీరో ప్రభాస్ అని కూడా చూడకుండా రాజమౌళి అన్న ఎస్ ఎస్ కాంచీ దారుణమైన సెటైర్ వేశాడు. పరోక్షంగా ఆయన ఆదిపురుష్ చిత్రంలో పసలేదని తేల్చేశాడు. నిన్న అట్టహాసంగా అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల చేశారు. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన ప్రభాస్ తో చేస్తున్న పౌరాణిక చిత్రం కావడంతో ఆదిపురుష్ టీజర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తం ఆదిపురుష్ టీజర్ కోసం ఎదురుచూశారు. తీరా విడుదలయ్యాక ఉసూరుమన్నారు. కనీస స్టార్డర్స్ లేని ఆదిపురుష్ టీజర్ సినిమా ఎలా ఉండబోతుంటే చెప్పకనే చెప్పేసింది.

టీవీ సీరియల్స్ ని తలపించేలా విజువల్స్, గ్రాఫిక్స్ ఉన్నాయి. ఇక రాముడి, రావణాసురుడితో పాటు ఇతర ప్రధాన క్యారెక్టర్స్ లుక్స్ కార్టూన్స్ ని తలపించాయి. ఆదిపురుష్ టీజర్ చూసి షాక్ తిన్న జనాలు ట్రోల్స్ కి తెగబడ్డారు. ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్, బాలీవుడ్ జనాలు ఓ రేంజ్ లో ఆదిపురుష్ చిత్రాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ జాబితాలో రాజమౌళి కజిన్ ఎస్ ఎస్ కాంచీ చేరారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఆదిపురుష్ మూవీపై సెటైర్ వేశారు. ”పౌరాణిక చిత్రం తీస్తే తెలుగువాడే తీయాలి” అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు.
ఆయన తన ట్వీట్ లో ఆదిపురుష్ పేరు ప్రస్తావించకున్నప్పటికీ… ప్రభాస్ మూవీని ఉద్దేశించే ఈ కామెంట్ చేశాడని స్పష్టంగా అర్థం అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీలో మేటర్ లేదని చెప్పకనే చెప్పాడు. తెలుగువాడు అంటే ఇక్కడ రాజమౌళి కూడా అనుకోవచ్చు. రాజమౌళి మాత్రమే రామాయణ, మహాభారతాలు అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించగలరని ఎస్ ఎస్ కాంచీ అభిప్రాయం.
రాజమౌళి మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన విషయం తెలిసిందే. ఎప్పటికైనా భారీ స్కేల్ తో ఆ ఎపిక్ తెరకెక్కిస్తానని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇక ఎస్ ఎస్ కాంచీ ట్వీట్ వైరల్ గా మారింది. రాజమౌళితో బాహుబలి చేసిన ప్రభాస్ మూవీపై కాంచీ ఇండైరెక్ట్ ట్వీట్ వైరల్ గా మారింది. కాగా ఎస్ ఎస్ కాంచీ ఆర్ ఆర్ ఆర్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. విజయేంద్రప్రసాద్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ కథ కోసం పని చేశారు. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రం పై సైతం పన్నీరు సెల్వం అంటూ సెటైర్ పోస్ట్ చేశాడు.
పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి…
— ss kanchi శివ శ్రీకాంచి (@kanchi5497) October 2, 2022