Rajamouli Mahesh Babu Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అందరికీ క్రేజీనే. అమ్మాయిల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న ఈ మిల్కీ బాయ్ ఏజ్ బార్ అయినా యంగ్ హీరోలకు పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం బిజీ సినీ షెడ్యూల్ తో ఉన్న మహేష్ బాబు త్వరలో రాజమౌళితో ఓ మూవీ తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆవురావురుమంటూ ఎదరుచూస్తున్నారు. అయతే ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా రాజమౌళి సినిమా ప్రకటన ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి నుంచి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. కానీ ఆరోజు ఏం ప్రకటిస్తారోనని చర్చించుకుంటున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు అయిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సొంతంగా ఇమేజ్ తెచ్చుకొని స్టార్ అయ్యాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ తో తన తదుపరి సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు. అయితే ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్టు రెడీ చేసిన జక్కన్న మంచి రోజుకు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే మహేష్ పుట్టిన రోజే ఈ ఈవెంట్ ను జరిపితే బాగుంటుందని అనుకుంటున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం SSMB29అనే పేరుతో ఆగస్టు 9న నిర్మాతలు ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్ బాబు సినీ కెరీర్లో ఎప్పుడూ చూడని స్క్రిప్టు రాజమౌళి సినిమా ద్వారా చూస్తారని ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా ఇప్పటికే ప్రిపేర్ చేశారని సమాచారం. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
విజయేంద్రప్రసాద్ రచించిన స్క్రిప్టు ప్రకారం హనుమంతుని పురాణం నుంచి కాన్సెప్ట్ తీసుకున్నట్లు సమాచారం. ఓ పౌరాణిక పాత్రలో మహేష్ బాబు ఉంటారని తెలుస్తోంది.ఈ మూవీ వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసేందుకు అనుగుణంగా స్క్రిప్టును తయారు చేస్తున్నారు. ఇక ఇందులో మహేష్ బాబు పక్కన దీపిక పదుకొణే నటిస్తారు. ఇప్పటికే ఆమెను సంప్రదించారు. మహేష్, దీపికా పదుకొణే కాంబినేషన్లో సినిమా గ్రాండ్ గా ఉంటుందని తెలుస్తోంది.