https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : స్టార్టింగ్ లోనే మహేష్ బాబు సెంటిమెంట్ ను బ్రేక్ చేయించిన రాజమౌళి…బాబుతో ఇంకా ఎన్ని ఫీట్లు చేయిస్తాడో అంటున్న ఫ్యాన్స్..?

తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కృష్ణ...ఆయన భారీ విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 3, 2025 / 02:29 PM IST

    Rajamouli , Mahesh Babu

    Follow us on

    Rajamouli and Mahesh Babu : తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కృష్ణ…ఆయన భారీ విజయాలను సాధిస్తూ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సైతం మంచి విజయాలను సాధించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు…ఇక ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటాడనేది తెలియాల్సి ఉంది….

    సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మహేష్ బాబు పోకిరి సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను కొట్టి తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తైతే ఇకమీదట ఆయన చేస్తున్న సినిమాలు కూడా మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఎవ్వరు లేకుండా కేవలం రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరూ మాత్రమే కలిసి ఈ పూజ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇక ఈ సినిమా 1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నప్పటికి ఈ సినిమాతో రాజమౌళి మరోసారి తన స్టార్ డమ్ ఏంటో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే ఇప్పటివరకు 15 సంవత్సరాల నుంచి మహేష్ బాబు తన ప్రతి సినిమా పూజా కార్యక్రమాలకైతే హాజరవ్వడం లేదు.

    అలాంటిది రాజమౌళి చెప్పాడనే ఉద్దేశ్యంతోనే నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు. ఇక మొదట్లోనే మహేష్ బాబు సెంటిమెంట్లను బ్రేక్ చేసిన రాజమౌళి ఇకమీదట ఎలాంటి సెంటిమెంట్లను బ్రేక్ చేసి మహేష్ బాబు కు సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడనేది తెలియాల్సి ఉంది. ఇక రాజమౌళి తో సినిమా అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

    మనకు సెంటిమెంట్లు పట్టుదలలు ఉంటే పనిచేయవు. ఎందుకంటే ఆయన చేసే సినిమాల్లో ఆయన చెప్పినట్టే చేయాలి లేకపోతే మాత్రం అసలు ఊరుకోడు. అందువల్లే ఆర్టిస్టులకు గాని, టెక్నిషన్స్ గాని ముందే ఆయన కండిషన్స్ పెట్టి తనతో పాటు ట్రావెల్ చేయించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటాడు. ఇక ఇది తెలిసిన మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు మొత్తం రాజమౌళి కి సరెండర్ అయిపోయినట్టే అంటూ ఒక అంచనాకైతే వచ్చారు.

    ఎందుకంటే మహేష్ బాబు ఇప్పటివరకు ఎలా కనిపించినా కూడా రాజమౌళి సినిమాలో మాత్రం చాలా కొత్తగా కనిపించబోతున్నారనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక కొత్త ఐడెంటిటిని క్రియేట్ చేసుకొని భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…