Rajamouli: ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న హీరోలు మాత్రం కొంతమందే ఉన్నారు వాళ్లలో మహేష్ బాబు ఒకడు. మహేష్ బాబు గతంలో చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో తనకంటూ ఒక భారీ విజయాన్ని అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే ఈయన తర్వాత సినిమా రాజమౌళితో చేయబోతున్నాడు అయితే ఈ సినిమాకి సంబంధించిన విషయాలు కొన్ని ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.అవి ఏంటి అంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక అడ్వెంచర్స్ చేసే కుర్రాడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం మహేష్ బాబు తీవ్రమైన కసరత్తులు కూడా చేయాల్సి ఉంటుందని రాజమౌళి ఇప్పటికే మహేష్ బాబుకు చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక గుంటూరు కారం సినిమా ఎప్పుడైతే షూటింగ్ పూర్తి అయిపోతుందో అప్పటినుంచి రాజమౌళి సినిమా మీద కూర్చోబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా 2024 సమ్మర్ లో స్టార్ట్ అవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో మహేష్ బాబు పాన్ వరల్డ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా కనక సూపర్ డూపర్ హిట్ అయితే మహేష్ బాబు వరల్డ్ లోనే మంచి హీరోగా గుర్తింపు పొందుతాడు నిజానికి రాజమౌళి డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ సినిమా అనేది సూపర్ సక్సెస్ అవుతుందనే చెప్పాలి.ఇక అదే రేంజ్ లో మహేష్ బాబు సినిమా కూడా సూపర్ సక్సెస్ చేస్తాడనే ఉద్దేశ్యం లో మహేష్ బాబు అభిమానులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో హాలీవుడ్ సినిమాలకు సైతం మహేష్ బాబు తనదైన పోటీ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అయితే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి చెప్పినట్టు గా వర్క్ ఔట్స్ మీద కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే రాజమౌళి చెప్పినట్టుగా బాడీని ఒక షేప్ లో చేయాలి అంటే ఆర్టిస్ట్ లకి అదొక రకమైన టాస్క్ అనే చెప్పాలి. ఇక దానికోసమే మహేష్ బాబు కొంచం బయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా రాజమౌళి చెప్పిన లుక్ లోకి మారడానికి మాత్రం మహేష్ బాబు తీవ్రం గా శ్రమించాల్సి ఉంటుంది అని మహేష్ బాబు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు…ఇక దాంతో ఇప్పుడు ఆయన వర్క్ ఔట్స్ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది…