Rajamouli RRR Copied Scenes: రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కోసం యావత్ భారత దేశం ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరినీ కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వారిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది.

ప్రేక్షకులను మెప్పించాడు..
కాంట్రవర్సీ స్టోరీని ఎంచుకుని తన దర్శకత్వ ప్రతిభతో తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై మొదట్లో విమర్శలు వచ్చాయి. వీటికి స్పందించిన రాజమౌళి సినిమాను సినిమా లాగే చూడాలని, చరిత్రో ముడిపెట్టొద్దని కోరారు. కుమురంభీం వారసులు కోర్టుకు వెళ్లినా.. సినిమా స్టోరీ మారలేదు. వేరువేరు తరాలకు చెందిన కుమురంభీం, అల్లూరి సీతతారామరాజును సమకాలీకులుగా చూపే ప్రయత్నంలో జక్కన్న ప్రేక్షకులను మెప్పించగలిగారు.
Also Read: Major Unnikrishnan: మేజర్ ఉన్నికృష్ణన్ గురించి రోమాలు నిక్కపొడిచే నిజాలు
అంత పెద్ద స్టార్ హీరోలని ఒకే తెరపై చూడటం కూడా ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. ముఖ్యంగా వారి మధ్య వచ్చే సీన్స్ చాలా మందిని ఎమోషనల్ చేశాయి. వీరిద్దరూ మొదటిసారి కలుసుకునే సీన్ కూడా చాలా బాగా తీశారు. నిజంగానే వారిద్దరినీ చూస్తూ ఉంటే పెద్ద హీరోల్లాగా కాకుండా ఆ పాత్రల్లాగానే కనిపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పాటలు సినిమా రిలీజ్‌కు ముందే విడుదల అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా కొమరం భీముడో పాట అయితే విడుదల అయిన వెంటనే ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. కీరవాణి గారు స్వరపరిచిన ఈ పాటని కాలభైరవ పాడారు. సినిమాలో ఈ పాట చూస్తున్నప్పుడు కూడా చాలా మంది ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ పాటలోని సీన్స్ ఒక ఇంగ్లీష్ సినిమాలోని కొన్ని సీన్స్‌కి దగ్గరగా ఉన్నాయి.

హాలీవుడ్ మూవీ నుంచి..
ఈ పాటలోని సీన్స్ హాలీవుడ్ సినిమా అయిన ప్యాషన్ ఆఫ్ క్రై స్ట్ అనే ఒక సినిమాలోని సీన్స్ ఒకే లాగా ఉన్నాయి. ఈ సినిమాకి మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించారు. మెల్ గిబ్సన్ రాజమౌళికి ఇష్టమైన దర్శకులలో ఒకరు. మెల్ గిబ్సన్ సినిమాల్లో ఎమోషన్స్ చూపించే విధానం రాజమౌళికి చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాలో కూడా అలాగే చూపించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రాజమౌళి తన ప్రతీ సినిమాలో ఏదో ఒకటి కాపీ చేస్తారనే అపవాదు ఉంది. ఆయన తీసిన సినిమా విడుదల అయిన తర్వాత విమర్శకులు కాపీ సన్నివేశాలను దొరకబుచ్చుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని కొమురంభీముడో పాట, దాని మూలం రెండు కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో చర్కర్లు కొడుతున్నాయి.
Also Read:Woman to Marry Herself: ఆమె పెళ్లి ఆమెతోనే!!.. దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి



[…] Also Read: Rajamouli RRR Copied Scenes: మక్కికి మక్కీ దించాడు.. రాజ… […]
[…] Also Read: Rajamouli RRR Copied Scenes: మక్కికి మక్కీ దించాడు.. రాజ… […]