వివాదాల రాయుడు రామ్ గోపాల్ వర్మ ఒక్కడే పబ్లిసిటీలో తోపు తురుము అంటూ నానాయాగీ చేస్తారు కాని, అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా నేషనల్ వైడ్ గా ఫుల్ ప్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడంలో రాజమౌళిని కొట్టేవాడు ఎవడు ఉన్నాడు. నిజానికి తన సినిమాలకు హైప్ తెచ్చుకునే విషయంలో రాజమౌళి ముందు ఆర్జీవీ కూడా సరిపోడు.
భావితరాల నిర్మాతలకు కచ్చితంగా చెప్పవచ్చు, రాజమౌళి తన సినిమాని ప్రమోట్ చేసే పద్దతిని ఒక కేసు స్టడీగా ట్రీట్ చేయమని. ముఖ్యంగా ‘బాహుబలి’ సిరీస్ ల విషయంలో రాజమౌళి సోషల్ మీడియాని వాడుకున్న విధానం మామూలుది కాదు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కి రాజమౌళి తన పద్ధతినే పక్కాగా ఫాలో అవుతున్నాడు.
మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా రిలీజ్ విషయంలో సైలెంట్ గా ఉంటూ వచ్చిన రాజమౌళి, సడెన్ గా తన టీంతో రోజూ సోషల్ మీడియాలో హంగామా చేయిస్తున్నాడు. ఎలాగూ రిలీజ్ కి కౌంట్ డౌన్ షురూ అయింది కాబట్టి, రాజమౌళి పబ్లిసిటీ విషయంలో కూడా బాగా యాక్టివ్ అయ్యాడు.
అయితే.. రాజమౌళి చేస్తోంది డైరెక్ట్ ప్రమోషన్స్ కాదు, పక్క బాషల్లో సినిమా పై హైప్ పెంచడానికి అందర్నీ పర్ఫెక్ట్ గా వాడుతున్నాడు. ముందుగా తన తండ్రి విజయేంద్రప్రసాద్ చేత ప్రస్తుతం విస్తృతంగా బాలీవుడ్ లో ఇంటర్వ్యూలు ఇప్పించడం మొదలుపెట్టారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అలియా భట్ చేత ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఎక్కడా రూపాయి కూడా ఖర్చు లేదు. రాజమౌళి రాజమౌళే.