https://oktelugu.com/

థియేటర్ల ఓపెనింగ్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్

కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం మార్చిలో లాక్డౌన్ విధించింది. దీంతో అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూతపడగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల కేంద్రం ఆన్ లాక్ విధిస్తూ ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లను ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గడిచిన ఆరునెలలు థియేటర్లు మూతపడటంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. థియేటర్లలో సినిమాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2020 / 09:53 AM IST
    Follow us on


    కరోనా మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం మార్చిలో లాక్డౌన్ విధించింది. దీంతో అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ మూతపడగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇటీవల కేంద్రం ఆన్ లాక్ విధిస్తూ ఒక్కో రంగానికి మినహాయింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లను ఓపెన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    గడిచిన ఆరునెలలు థియేటర్లు మూతపడటంతో ఈ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. థియేటర్లలో సినిమాలు చూసే ప్రేక్షకులంతా ఓటీటీలకు అలవాటుపడిపోయారు. ఇలాంటి తరుణంలో కేంద్రం థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయితే వీటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    కరోనా నిబంధనలు పాటిస్తూ 50శాతం అక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసుకోవాలని కేంద్రం ఆదేశాలివ్వడంపై దర్శకుడు రాజమౌళి షాకింగ్ కామెంట్ చేశారు. 50శాతం సీట్లనే అందుబాటులో ఉంచడం వల్ల థియేటర్ వెళ్తే ప్రమాదం ఏదైనా వస్తుందా? అనే అనుమానం జనాలకు వస్తుందన్నారు. 50శాతం సీట్లతో థియేటర్లు ఓపెన్ చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని రాజమౌళి వ్యక్తం చేశారు.

    విమానాల్లో పక్కపక్కన కూర్చొని రెండు మూడుగంటలు ప్రయాణిస్తున్నారు.. వాటితో పొలిస్తే థియేటర్ల సీట్ల మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటుందని రాజమౌళి తెలిపారు. మాస్కులు వేసుకోకుండా జనాలు గుంపులు గుంపులుగా తిరుగున్నప్పుడు రాని ప్రమాదం మాస్కులు వేసుకొని థియేటర్లకు వెళితే మాత్రం వస్తుందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు.

    ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ చేయడమే మహాభాగ్యమన్నట్లుగా మారింది ఎగ్జిబిటర్ల పరిస్థితి. థియేటర్లు ఓపెన్ అయ్యాక ఫుల్ రన్ గురించి చూద్దాం అన్నట్లుగా యాజమాన్యాలు ఉండటం గమనార్హం. ఇక థియేటర్లు ఓపెన్ అయ్యాక ప్రేక్షకులు ఏమేరకు వస్తారనేది మాత్రం వేచి చూడాల్సిందే..!