Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా ఈనెల 22వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ ని విపరీతంగా కండక్ట్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే రాజమౌళి తో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి రాజమౌళి ఒక్కడికే సపరేట్ గా ఒక షో వేసినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా చూసిన రాజమౌళి కొంత సేపటి వరకు ఎవ్వరితో మాట్లాడకుండా కామ్ గా ఉన్నట్టు గా తెలుస్తుంది.ఆ సినిమా చూశాక తన మైండ్ స్టెబిల్ లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్ ని ఆ రేంజ్ లో మనం ఎప్పుడు చూడలేదంటూ రాజమౌళి షాక్ కు గురైనట్టుగా తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ మేకింగ్ కానీ ప్రభాస్ చెప్పే డైలాగులు గాని,ఆయన యాక్టింగ్ గాని ఈ సినిమాకి మరో ఆకర్షణ గా నిలుస్తాయని రాజమౌళి చిత్ర యూనిట్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజానికి రాజమౌళి లాంటి ఒక గొప్ప డైరెక్టర్ ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ గురించి అంత గొప్పగా చెబుతున్నాడు అంటే కచ్చితంగా ఈ సినిమా ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతుందని అర్థమవుతుంది.
ఇప్పటికే ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.ఇక ఈ సినిమా చూసి రాజమౌళి ఒకే మాట చెప్పినట్టు గా తెలుస్తుంది. ఈ సినిమా బాహుబలి ని మించి ఉంది అని అనడం తో చిత్ర యూనిట్ అయితే పండగ చేసుకుంటున్నట్టు గా తెలుస్తుంది… అయితే జక్కన్న ఇలా చెప్పడం నిజంగా చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఈ సినిమా మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన జూలు విదల్చడానికి రెడీగా ఉన్నట్టుగా అర్థమవుతుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం హైలైట్ గా నిలవనున్నట్టు గా తెలుస్తుంది. ఇక రాజమౌళి ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పాడంటే ఇక అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు… 22వ తేదీ కోసం ప్రతి ప్రేక్షకుడు కూడా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఒక 2,3 రోజుల్లో రాజమౌళి కూడా ఓపెన్ గా ఈ సినిమా గురించి ఆడియెన్స్ తో చెప్పబోతున్నట్టు గా తెలుస్తుంది…