https://oktelugu.com/

Prabhas : ఇలా అయితే రాజాసాబ్ హిట్ అవ్వడం కష్టమే…రోజురోజుకి అంచనాలు లేకుండా చేస్తున్న ప్రభాస్…

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ల సినిమాలను చూడడానికి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది...

Written By: , Updated On : February 21, 2025 / 08:27 AM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)… ఈయన రాజమౌళి(Rajamouli) తో చేసిన బాహుబలి (Bahubali) సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో స్టార్ హీరోగా అవతరించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సగటు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది. ఒకవేళ ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పాన్ ఇండియాలో భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఇప్పటికే ఆయనకు ఇండియా వైడ్ గా భారీ అభిమానులైతే ఉన్నారు. మరి ఆ అభిమానులందరిని అలరించడానికి ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజి ( Fouji) సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఇక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కుతుంది అంటూ తన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ సినిమా స్టార్ట్ అయి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ అయితే అవ్వలేదు.

ఎప్పటికప్పుడు ఏదో కారణంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మొత్తం షూటింగ్ పూర్తి చేసి సినిమాని తొందర్లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఏప్రిల్ 10వ తేదీన సినిమా రిలీజ్ డేట్ ఉన్న నేపథ్యంలో ఈ రిలీజ్ డేట్ ని మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు రహస్యంగా ఉంచినప్పటికి సినిమా షూటింగ్ అయితే పూర్తవ్వలేదట. ప్రభాస్ మరో 10 రోజులు తన డేట్స్ ఇస్తే సినిమా షూట్ పూర్తి అవుతుంది. ఇక సినిమా దర్శకుడు అయిన మారుతి ఈ సినిమా ద్వారా బాగా సఫర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ మాత్రం ఫౌజీ సినిమా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు…

ఇక రాజాసాబ్ సినిమ్స్ మీద ప్రభాస్ కి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని పక్కన పెట్టవచ్చు కదా ఎందుకు డైరెక్టర్ మారుతిని ఇన్ని రోజులపాటు వెయిట్ చేస్తున్నాడు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటి క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తన అభిమానులను అలరించడానికి డిఫరెంట్ కనిపించబోతున్నాడట. తర్వాత ఇక ఈ సినిమాలో దెయ్యం గా నటించి మెప్పించే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…