Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu and Rajamouli : ఆ విషయంలో మహేష్ బాబుకు రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్,...

Mahesh Babu and Rajamouli : ఆ విషయంలో మహేష్ బాబుకు రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్, మేటర్ తెలిస్తే మైండ్ బ్లాక్!

Mahesh Babu and Rajamouli : రాజమౌళితో మూవీ అంటే సదరు హీరో అభిమానులు పండగ చేసుకుంటారు. రికార్డుల ప్రస్తావనే కానీ, జయాపజయాల భయం ఉండదు. హీరో పేరిట కొత్త రికార్డులు నమోదు అవుతాయి. ఇమేజ్ ఎల్లలు దాటేస్తుంది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్… వంటి హీరోలు రాజమౌళి చిత్రాలతో పాన్ ఇండియా హీరోలు అయ్యారు. కొందరు హీరోలతో రిపీటెడ్ గా సినిమాలు చేసిన రాజమౌళి మరికొందరు హీరోలతో కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎట్టకేలకు మహేష్ బాబుతో రాజమౌళి మూవీ చేస్తున్నారు.

SSMB 29 సెట్స్ పై ఉంది. చడీ చప్పుడు లేకుండా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ రాజమౌళి వేయించారని సమాచారం. SSMB 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా. మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం మహేష్ బాబు తన లుక్ పూర్తిగా మార్చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా జుట్టు, గడ్డం పెంచాడు. ఆఫ్రికాలో సైతం షూటింగ్ ప్లాన్ చేశారు.

కాగా మహేష్ బాబుకు రిస్క్స్ చేయడం అంటే మహా ఇష్టం అట. ఆయన డూపు లేకుండా కష్టమైన స్టంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వన్ నేనొక్కడినే చిత్రంలో ఒక భవనం మీద నుండి మరో భవనం మీదకు మహేష్ బాబు దూకాడట. ఈ విషయంలో తండ్రి కృష్ణ హెచ్చరిస్తూ ఉండేవాడట. అయినప్పటికీ మహేష్ బాబు రిస్క్ తో కూడిన స్టంట్స్ చేయడం మానలేదట. రాజమౌళి మాత్రం అలాంటి రిస్క్స్ చేయడానికి వీల్లేదని గట్టిగా చెప్పాడట.

రిస్కీ స్టంట్స్ చేసే క్రమంలో పొరపాటున గాయాలపాలైతే విరామం తీసుకోవాల్సి వస్తుంది. షూటింగ్ అనుకున్న సమయంలో జరగకపోతే ఇతర నటుల కాల్షీట్స్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. భారీ బడ్జెట్ మూవీ కావడంతో డిలే అయ్యే కొద్దీ, కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు అవుతాయి. ఈ కారణాలతో మహేష్ బాబుకు రిస్కీ స్టంట్స్ చేయవద్దని సూచించాడట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

SSMB 29 బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు అని సమాచారం. పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అందుకే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇతర నటుల వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular