Manchu Lakshmi : మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రస్తుతం ముంబైలో ఉంటుంది. దాదాపు రెండు దశాబ్దాలు ఆమె టాలీవుడ్ లో నటిగా, నిర్మాతగా కొనసాగింది. అమెరికాలో కెరీర్ ప్రారంభించిన మంచు లక్ష్మి, అక్కడ కొన్ని టెలివిజన్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అలాగే ఒకటి రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. అనంతరం టాలీవుడ్ కి మకాం మార్చింది. అనగనగా ఓ ధీరుడు మూవీలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ చేసింది. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో హీరోయిన్ గా కూడా చేసింది.
మంచు లక్ష్మికి నటిగా బ్రేక్ రాలేదు. తెలుగులో సైతం కొన్ని టాక్ షోలకు హోస్ట్ గా వ్యవహరించింది. మంచు లక్ష్మి మాటతీరు, ప్రవర్తన తరచుగా ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. అయితే ట్రోల్స్ ని మంచు లక్ష్మి పట్టించుకోదు. ఒకరి కోసం మనం బ్రతక కూడదు. మనకు నచ్చినట్లు జీవించడమే లైఫ్ అంటుంది. కాగా మంచు లక్ష్మి వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది తక్కువే. ఆమె తండ్రి, తమ్ముళ్ళతో కలిసి కనిపిస్తారు కానీ, భర్తతో చాలా తక్కువ సందర్భాల్లో కనిపించారు.
ఈ మధ్య మంచు విష్ణు, మోహన్ బాబులకు కూడా ఆమె దూరంగా ఉంటున్నారు. అందుకు కుటుంబంలో తలెత్తిన వివాదాలే కారణం అనే వాదన ఉంది. ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి ఒంటరిగా కూతురితో జీవిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి భర్తతో ఎందుకు కలిసి జీవించడం లేదో వెల్లడించారు. మంచు లక్ష్మి భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఆయన ఐటీ ప్రొఫెషనల్ అని సమాచారం. శ్రీనివాసన్ విదేశాల్లో ఉంటారు. స్వేచ్ఛగా ఒకరి అభిప్రాయాలు మరొకరు గౌరవిస్తూ జీవించాలని మేము కోరుకుంటాము. దూరంగా ఉన్నప్పటికీ అన్యోన్యత, ప్రేమ ఉంటాయి.
ఎవరో ఏదో అనుకుంటారని, వారి కోసం బ్రతకము. నేను రెండు నెలలు భర్తతో ఉండి వచ్చాను. ఇప్పుడు నా కూతురు ఆయన వద్దే ఉంది. జనాల గురించి ఆలోచించి మా పీస్ కోల్పోము.. అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి ముంబైలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని అక్కడే ఉంటుంది. సినిమాలు తగ్గించింది. మంచు లక్ష్మికి ఆఫర్స్ కూడా పెద్దగా రావడం లేదు.