RRR Movie Story Leaked: నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు రాజమౌళి. కాగా ఆయన డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ విషాదాంతం అని టాక్ నడుస్తోంది.
చరణ్ – ఎన్టీఆర్ ల పాత్రల్లో ఒక పాత్ర చనిపోతుందట. రాజమౌళి తన సినిమాలో ఎండింగ్ ఎలా ప్లాన్ చేసినా.. అందర్నీ ఒప్పించగలడు. గతంలో ‘విక్రమార్కుడు, బాహుబలి, మగధీర లాంటి సినిమాలలో హీరోను చంపేసి కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో కూడా అదే చేస్తున్నాడు అని అంటున్నారు.
Also Read: అప్పటి ముచ్చట్లు : ఎన్టీఆర్ మిరపకాయలు తీసుకుని నమిలేశాడు.. అది చూసిన వాణిశ్రీ.. !
ఇంతకీ చరణ్ – ఎన్టీఆర్ లలో చనిపోయే హీరో ఎవరో తెలుసా ? ఎన్టీఆర్ అట. కొన్ని వేలమంది ప్రాణాలను కాపాడటానికి ఎన్టీఆర్ పాత్ర కావాలని ప్రాణ త్యాగం చేస్తోందని.. ఈ సీక్వెన్స్ వెరీ ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రీమియర్స్‌తో ఆర్ఆర్ఆర్ ఒకరోజు ముందుగా, అంటే మార్చి 24నే పలకరించనుంది. ఇప్పటికే ఏ చిత్రానికి లేనంత క్రేజీగా ప్రీమియర్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
ట్రేడ్ వర్గాల ప్రకారం యూఎస్‌లో 267 లోకేషన్లలో 935 షోస్‌కి అప్పుడే $500k వచ్చేశాయి. ప్రీ టికెట్ సేల్స్‌లో సంచలనం సృష్టించింది ఆర్ఆర్ఆర్. చరణ్, తారక్ అభిమానులు ఒక్క టికెట్‌తో ఆగట్లేదట. ఒక్కొక్కరు రెండేసి టికెట్లు కొంటున్నారు. పైగా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రావట్లేదు.
ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: ‘రాధేశ్యామ్’ రివ్యూ : సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇవే