Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు లాంటి నటుడు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం రీతిలో వరుస విజయాలను అందుకున్న ఏకైక దర్శకుడు కూడా రాజమౌళి కావడం విశేషం…ఇక ఆయన వల్లే మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటివరకు రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ని బయటకు అయితే తెలియజేయడం లేదు. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసినప్పటికి అందులో మహేష్ బాబు ఫేస్ అయితే కనిపించలేదు. మరి ఇలా ఆయన ఎందుకని మహేష్ బాబు సినిమాకి సంబంధించిన రహస్యాలను దాస్తున్నాడు అంటూ అతని అభిమానులు కొంత వరకు చిరాకు పడుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల లిస్ట్ అయితే బయటికి రిలీజ్ చేశారు అంటూ ఒక న్యూస్ అయితే వినిపిస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి విజయ్ సేతుపతి నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: అసలు ఎవరు ఈ ఒమీ..ఓజాస్ గంభీర కంటే పవర్ ఫుల్ నా..? బ్యాక్ స్టోరీ చూస్తే మెంటలెక్కిపోతారు!
ఇక తనతో పాటుగా మలయాళం ఇండస్ట్రీలో పృథ్వీరాజ్ సుకుమారన్, కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కిచ్చా సుదీప్, బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహం నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇండియాలో ఉన్న అన్ని భాషల నటులను ఇందులో మిళితం చేసి మరి ఈ సినిమాను తెరకెక్కించాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు.
ఇక ఒక్కొక్కరికి సంబంధించిన సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరించే పనుల్లో రాజమౌళి అయితే ఉన్నాడు. మరి ఈ లిస్టు ను రాజమౌళి రిలీజ్ చేశాడా? లేదంటే ఇతరులు ఎవరైనా కావాలని ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. తన ఆరాధ్య దర్శకుడు అయిన జేమ్స్ కామెరూన్ ను సైతం ఈ మూవీతో మెప్పించాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరు ఈ సినిమా చూడటానికి చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం…