https://oktelugu.com/

Rajamouli : రవితేజ రాజమౌళి కాంబోలో మిస్ అయిన రెండో సినిమా ఏంటో తెలుసా..?

Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : March 17, 2025 / 11:28 AM IST
    Rajamouli

    Rajamouli

    Follow us on

    Rajamouli : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకులలో రాజమౌళి (Rajamouli) మొదటి స్థానంలో ఉంటాడు. బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని సృష్టించిన దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం…

    సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన లాంటి దర్శకుడు మరొకరు లేరనేది వాస్తవం. ఆయన చేస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్న మైతే చేస్తూ ఉంటాడు. అందువల్లే రాజమౌళి(Rajamouli) కి ఇండియా వైడ్ గా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబు (Mahesh Babu)తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. గతంలో ఆయన రవితేజ తో కలిసి చేసిన విక్రమార్కుడు (Vikramarkudu) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. మరి ఈ సినిమాతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు రావడమే కాకుండా వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నారు… ఇక వీళ్ళ కాంబోలో మరో సినిమా వస్తుందంటు అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు.

    Also Read : రాజమౌళి కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న లీకేజీలు…

    ఇక ఈ సినిమా కనక వచ్చి ఉంటే రవితేజ స్టార్ హీరోగా మారిపోయేవాడు. ఇందులో రవితేజ ఆర్మీ సోల్జర్ గా కనిపించేవారట మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనక పట్టాలెక్కుంటే ఓవర్ నైట్ లో రవితేజ టైర్ వన్ హీరోగా మారిపోయేవాడు. ప్రస్తుతం ఆయన మీడియం రేంజ్ హీరోగా కొనసాగుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

    ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనతో సినిమాలు చేయడానికి ఇప్పుడు యంగ్ డైరెక్టర్లందరూ ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే ఆయన చేస్తున్న వరుస సినిమాలు డిజాస్టర్ల బాట పడుతున్నాయి. ఇకమీదట వచ్చే సినిమాలతో ఆయన మంచి విజయాలను సాధిస్తేనే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడు.

    లేకపోతే మాత్రం ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోలతో పోటీ పడలేక ఢీలాపడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని సినిమాల్లో వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకొని మంచి సినిమాలను చేస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ఆయన భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ తో ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు…

    Also Read : మహేష్, రాజమౌళి సినిమా కోసం ముంబైలో ఆస్తులను అమ్ముతున్న ప్రియాంక చోప్రా..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!