https://oktelugu.com/

Rajamouli- Mahesh Babu: మహేష్ టెన్షన్.. కారణం రాజమౌళి సినిమానే

Rajamouli- Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి చేయబోతున్న పాన్ ఇండియా సినిమా విషయంలో మహేష్ విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ ఎందుకు ? దర్శకుడు రాజమౌళి… కళ్ళు చెదిరే విజయాలు అందుకున్నారు. తెలుగునాట సంచలనం సృష్టించిన దర్శకుడిగా జక్కన్నకి తిరుగు లేదు. పైగా హిందీ మార్కెట్ లో కూడా రాజమౌళిదే పై స్థాయి. ‘బాహుబలి’తోనే రాజమౌళికి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’తో ఆ ఇమేజ్ డబుల్ అయ్యింది. అదే […]

Written By:
  • Shiva
  • , Updated On : June 29, 2022 / 12:15 PM IST
    Follow us on

    Rajamouli- Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి చేయబోతున్న పాన్ ఇండియా సినిమా విషయంలో మహేష్ విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ ఎందుకు ? దర్శకుడు రాజమౌళి… కళ్ళు చెదిరే విజయాలు అందుకున్నారు. తెలుగునాట సంచలనం సృష్టించిన దర్శకుడిగా జక్కన్నకి తిరుగు లేదు. పైగా హిందీ మార్కెట్ లో కూడా రాజమౌళిదే పై స్థాయి. ‘బాహుబలి’తోనే రాజమౌళికి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.

    Rajamouli- Mahesh Babu

    ‘ఆర్ఆర్ఆర్’తో ఆ ఇమేజ్ డబుల్ అయ్యింది. అదే మహేష్ బాబు టెన్షన్. రాజమౌళి సినిమా అంటే.. అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే, ఇప్పుడు మహేష్ కి టెన్షన్ షురూ అయింది. మహేష్ తో సినిమా ‘భారీగా’ తీయాలంటే ఏమి చెయ్యాలన్న విషయంలోనే రాజమౌళి ప్రస్తుతం ఆలోచిస్తున్నాడు. ఎలాగూ బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. అన్ని కలిసొస్తే పెద్ద హిట్ అవొచ్చు.

    Also Read: Chor Baazar 5th Day Collections: ‘చోర్ బజార్’ ’5 డేస్ కలెక్షన్స్’.. ఎన్ని కోట్లు నష్టం అంటే ?

    అందుకే, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని మహేష్ బాబు పట్టుదలగా ఉన్నాడు. హీరో పట్టుబడుతున్నారు కాబట్టి, రాజమౌళి కూడా భారీతనం విషయంలో రాజీపడొద్దు అని ఫిక్స్ అయ్యాడు. సహజంగానే జక్కన్న కాంప్రమైజ్ కాడు. కానీ.. మహేష్ తో చేయబోయే సినిమాని స్పీడ్ గా చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే తెలుగునే మెయిన్ టార్గెట్ చేశారు.

    హిందీలో డబ్ చేయాలనుకున్నారు. డబ్ చేస్తే అంచనాలు అందుకోవడం ఎలా? ఈ విషయంలోనే తర్జన భర్జన పడుతున్నాడు మహేష్. అందుకే, ఈ సినిమా విషయంలో రాజమౌళి పడుతున్న టెన్షన్ కన్నా, మహేష్ పడుతున్న టెన్షనే ఎక్కువ. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్… తగ్గేదేలే అంటున్నారు. మరి రాజమౌళి ఏమి చేస్తారో, ఎంత టైం తీసుకుంటారో చూడాలి.

    Rajamouli- Mahesh Babu

    అన్నట్టు ఈ పాన్ ఇండియా సినిమా పై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. ‘ప్రస్తుతం ఈ సినిమా కథను సిద్ధం చేస్తున్నాం. స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదు. అడవి నేపథ్యంలో కథ సాగుతుంది. వచ్చే ఏడాది రాజమౌళి-మహేష్ సినిమా ప్రారంభం అవుతుంది. జూన్ నుంచి త్రివిక్రమ్ సినిమాతో మహేష్ బిజీగా ఉంటాడు’ అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు.

    నిజానికి మహేష్ కోసం విజయేంద్ర ప్రసాద్‌, కథను ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో రాశారని.. ఆ ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల గుట్టల పై ఈ సినిమా సాగుతుందని గతంలో వార్తలు వినిపించాయి. ఫారెస్ట్‌ లో ఉన్న నిధుల అంటే.. ఆ నిధుల కోసం ప్రపంచ సాహస వీరులు అంతా పోటీ పడతారట. ఎవరికీ వారు ఎత్తులకు పై ఎత్తులు వేసి క్రమంలో ప్రత్యర్థులను చంపుతూ నిధి వేటకు బయలు దేరుతారని తెలుస్తోంది. మొత్తమ్మీద ఫారెస్ట్‌ లో జరిగే యాక్షన్‌ ఎడ్వెంచరెస్‌ సీన్లు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.

    Also Read:Akash Puri Annoyed Balayya Babu: బాలయ్య బాబుకి చిరాకు రప్పించిన పూరి జగనాథ్ కొడుకు ఆకాష్

    Tags