https://oktelugu.com/

Rajamouli On Bahubali 3: ‘బాహుబలి 3’లో ఎన్టీఆర్.. ఏ పాత్రలో నటిస్తున్నాడు అంటే ?

Rajamouli On Bahubali 3: ‘ఆర్ఆర్ఆర్’ ముచ్చట ఇంకా పూర్తి కాకముందే.. ప్రస్తుతం ‘బాహుబలి 3’ ముచ్చట మొదలైపోయింది. సహజంగానే.. రాజమౌళి హాలీవుడ్ రేంజ్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్నాడు కాబట్టి, ఆయన ఏ సినిమా చేసినా ఇప్పుడు ఆ సినిమా పై ప్రేక్షకులు మనసు పారేసుకోవడానికి కాసుకొని కూర్చున్నారు. ఈ క్రమంలో ‘బాహుబలి 3’ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. పైగా రాజమౌళి కూడా తన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి సిరీస్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 15, 2022 / 02:18 PM IST
    Follow us on

    Rajamouli On Bahubali 3: ‘ఆర్ఆర్ఆర్’ ముచ్చట ఇంకా పూర్తి కాకముందే.. ప్రస్తుతం ‘బాహుబలి 3’ ముచ్చట మొదలైపోయింది. సహజంగానే.. రాజమౌళి హాలీవుడ్ రేంజ్ సినిమాతో ప్రపంచ ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్నాడు కాబట్టి, ఆయన ఏ సినిమా చేసినా ఇప్పుడు ఆ సినిమా పై ప్రేక్షకులు మనసు పారేసుకోవడానికి కాసుకొని కూర్చున్నారు. ఈ క్రమంలో ‘బాహుబలి 3’ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

    Rajamouli On Bahubali 3

    పైగా రాజమౌళి కూడా తన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి సిరీస్ కి మరో సీక్వెల్ తీయాలని ఎప్పటి నుంచో ఆశ పడుతున్నాడు. ఎంతైనా బాహుబలి అద్భుతమైన రీతిలో సక్సెస్ అయ్యింది.. దాని పై రాజమౌళికి ప్రేమ ఉండటంలో వింత ఏమి లేదు. అందుకే, సీక్వెల్ గా రానున్న బాహుబలి 3 ఎప్పుడు స్టార్ట్ కానుంది ? ఈ సినిమా కోసం జక్కన ఎలాంటి సన్నాహాలు చేస్తున్నాడు ? లాంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    Also Read:  ప్చ్.. ‘రాధేశ్యామ్’ పరిస్థితి మరీ ఇంత దారుణమా ?

    అయితే, ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్ ప్రకారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో కనిపిస్తాడట. ప్రభాస్ కొడుకు పాత్రలో తారక్ కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. కాకపోతే, రాజమౌళి ఇప్పటికే ‘బాహుబలి 3’ ఉంటుంది అని కన్ఫర్మ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు తెగ సంతోష పడిపోతున్నారు.

    ప్రస్తుతానికి అయితే, రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి రియాక్ట్ అవుతూ.. ‘బాహుబలి’ చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ‘బాహుబలి 3’లో చూపించబోతున్నామన్నారు.

    Rajamouli, NTR

    దానికి సంబంధించిన వర్క్‌ జరుగుతోందని, నిర్మాత శోభు యార్లగడ్డ కూడా సుముఖ వ్యక్తం చేశారని రాజమౌళి చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి కొంచెం సమయం పట్టొచ్చని, అయితే బాహుబలి రాజ్యం నుంచి ఆసక్తికరమైన వార్త వస్తుందని రాజమౌళి చెప్పుకొచ్చారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఈ కబురు వెలువడిందో లేదో వెయిటింగ్‌ అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

    ఇక నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి దర్శకత్వంలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా ప్రస్తుతం భారీ రికార్డ్స్ ను క్రియేట్ చేయడానికి సిద్ధం అయ్యింది. దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్యాన్‌ ఇండియా మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

    Tags