Bigg Boss OTT Telugu Elimination: బిగ్ బాస్ ఓటీటీ గతాన్ని కంటే చాలా విభిన్నంగా సాగుతోంది. ఎవ్వరూ ఊహించని టాస్క్ లతో 24 గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తోంది. 17 మంది కంటెస్టెంట్ లో ఇప్పటికే ముమైత్ ఖాన్, శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యారు. రెండు వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ మూడోవారం లోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా హౌస్ లోని కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ హోలీ ఈవెంట్ ను నిర్వహించాడు. కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు అనే టాస్క్ లో భాగంగా నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ పెట్టాడు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిపై రంగు చల్లి నామినేట్ చేయాల్సి ఉంటుంది. తేజస్వి ఈ టాస్క్ మొదలుపెట్టింది. అరియాణ, చైతులను నామినేట్ చేసింది.
ఆమె తర్వాత యాంకర్ శివ వచ్చి నటరాజ్ మాస్టర్‌తో పాటు అఖిల్‌ను నామినేట్ చేయగా.. బిందు వచ్చి తేజస్వి, అఖిల్‌ను నామినేట్ చేసింది. హమీదా వచ్చి స్రవంతిని అలాగే అజయ్‌ను నామినేట్ చేయగా.. స్రవంతి మాత్రం హమీద, మిత్ర శర్మని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. ఆర్జే చైతు వచ్చి తేజస్విని, మిత్ర శర్మను చేయగా.. మహేష్ విట్టా మాత్రం అజయ్, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేశాడు.
ఇక అషురెడ్డి ఎప్పటి లాగే మహేష్ విట్టా, మిత్రశర్మను చేయగా, నటరాజ్ మాస్టర్ వచ్చి శివ, బిందుల పేర్లు చెప్పాడు. వారి తర్వాత సరయు వచ్చి స్రవంతి, అజయ్‌ల పేర్లు చెప్పగా, అనిల్ వచ్చి మహేష్ విట్టా, మిత్ర శర్మల పేర్లు చెప్పాడు. అఖిల్ సర్థాక్ మాత్రం శివ, ఆర్జే చైతులను చేయగా.. అరియానా తేజస్వి, మిత్ర శర్మల పేర్లు చెప్పింది. మిత్ర శర్మ మాత్రం శివతో పాటుగా చైతును నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. ఇలా ఉన్న 15 మందిలో ఏకంగా 12 మంది నామినేట్ అయ్యారు. అరియాన, సరయు, అనిల్ మాత్రమే మిగిలారు. అయితే బిగ్ బాస్ చరిత్రలో ఇంతమంది నామినేట్ కావడం ఇదే తొలిసారి.
Also Read: OKTelugu MovieTime: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్