Rajamouli Next Three Movies: దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమాలు చెయ్యడానికి ఇండియా లో ఉన్న పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అందరూ పోటీ పడే సంగతి మన అందరికి తెలిసిందే..ఆయనతో ఒక్క సినిమా పడితే బాగుండును అని హీరోల అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు..హీరోల కాల్ షీట్స్ మినిమం రెండు సంవత్సరాలు బ్లాక్ చేసుకొని సినిమా తీసినప్పటికి,ఆయన హీరోలకి తిరుగులేని స్టార్ డం ఇచ్చే సినిమాలు తియ్యడం రాజమౌళి స్టైల్..చిరుత సినిమా తర్వాత కేవలం రెండవ సినిమాతోనే మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని తీసి రామ్ చరణ్ ని స్టార్ హీరో గా నిలబెట్టాడు..ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రచ్చ , నాయక్ మరియు ఎవడు లాంటి మాములు యావరేజి సినిమాలు తీసినా బాక్స్ ఆఫీస్ దగ్గర వాటిని కమర్షియల్ గా సూపర్ హిట్స్ చేసేంత రేంజ్ కి ఎదిగిపోయాడు రామ్ చరణ్..ఇక ఎన్టీఆర్ కి ఆయన తీసిన సింహాద్రి సినిమా మాస్ లో ఎలాంటి కల్ట్ ఫ్యాన్ బేస్ వచ్చేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆ సినిమా తర్వాత వరుస హిట్స్ తో కొట్టుమిట్టాడుతున్న ఎన్టీఆర్ కి మళ్ళీ రాజమౌళి యమదొంగ సినిమా తో పునర్జన్మ ఇచ్చాడు.

ప్రభాస్ కి ఛత్రపతి వంటి సెన్సషనల్ హిట్ ని ఇచ్చి స్టార్ ని చేసిన రాజమౌళి..కొన్నేళ్ల తర్వాత ఆయనతోనే బాహుబలి సిరీస్ తీసి ఇండియా లోనే నెంబర్ 1 పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా మలిచాడు..ఇక #RRR సినిమా తో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ని పాన్ ఇండియా లో తిరుగులేని స్టార్స్ గా ఎలా నిలబెట్టాడో మన అందరికి తెలిసిందే..అందుకే రాజమౌళి తో సినిమాలు చెయ్యడానికి మన స్టార్ హీరోలు ఎగబడతారు..కేవలం టాలీవుడ్ హీరోలకు మాత్రమే కాదు , బాలీవుడ్ మరియు కోలీవుడ్ హీరోలకు కూడా రాజమౌళి తో పని చెయ్యాలి అనే కోరిక ఉంటుంది..ఇది ఇలా ఉండగా #RRR తర్వాత రాజమౌళి పని చెయ్యబోతున్న హీరోలు ఎవ్వరో తెలుసుకోడానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నాను అని ప్రకటించిన రాజమౌళి త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఒక్క సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..అల్లు అరవింద్ ఇప్పటికే రాజమౌళి తో పలు మార్లు చర్చలు జరిపాడు అని..మహేష్ తో సినిమా పూర్తి అయినా తర్వాత గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో సినిమా చేస్తాను అని అల్లు అరవింద్ కి మాట ఇచ్చినట్టు తెలుస్తుంది..గతం లో గీత ఆర్ట్స్ బ్యానర్ మీద రాజమౌళి తీసిన మగధీర చిత్రం ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమా ద్వారానే రాజమౌళి కి మొట్టమొదటిసారి నేషనల్ లెవెల్ లో గుర్తింపు లభించింది..ఇక సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు..మళ్ళీ అదే బ్యానర్ లో సినిమా రాబోతుండడం తో ఈసారి బాక్స్ ఆఫీస్ స్థాయిని ఏ రేంజ్ కి తీసుకెళ్ళబోతున్నాడో చూడాలి..ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాత రాజమౌళి మళ్ళీ రామ్ చరణ్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి..#RRR తర్వాత రాజమౌళి పని చెయ్యబొయ్యే ముగ్గురు హీరోలు వీళ్ళే అంటూ సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి జోరుగా ప్రచారం సాగుతున్నాయి.