Rajamouli next movie: దర్శక ధీరుడు రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం అటెన్షన్ ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆయన సినిమా రిలీజైతే అంతకుముందు ఉన్న అన్ని రికార్డులు తుడిచిపెట్టుకొని పోతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గతంలో బాహుబలి 2 సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన త్రిబుల్ ఆర్ సినిమా తో మరో మెట్టు పైకి ఎక్కడనే చెప్పాలి. ఇక ఇప్పుడు వారణాసి సినిమాతో ప్రేక్షకులను అలరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు… మహేష్ బాబు తో మొదటిసారి పనిచేస్తున్న రాజమౌళి ఈ సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమా బడ్జెట్ ని భారీగా పెంచేస్తున్నట్టుగా తెలుస్తుంది… మహేష్ బాబు లాస్ట్ సినిమా ‘గుంటూరు కారం’ కి కేవలం 200 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని హీరోని తీసుకొని అతని మీద 1500 కోట్ల బడ్జెట్ ను పెట్టి సోనియా చేస్తున్నాడంటే అది మామూలు రిస్క్ కాదు. అది కేవలం రాజమౌళికే చెల్లుతుంది.
మరి అలాంటి రాజమౌళి ఈ సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేసి ఎలాగైనా సరే ఈ సినిమాను సక్సెస్ తీరాల్లో నిలుపుతాడని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ 50% కంప్లీట్ అయిపోయిందట. ఇక మిగిలిన 50% షూట్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి వాళ్ల నాన్న అయిన విజయేంద్రప్రసాద్ మరో సినిమాకి కథనైతే రెడీ చేశారట.
రాజమౌళి సినిమాలకు విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తాడనే విషయం అందరికి తెలిసిందే. మరి తన నుంచి మరో మంచి కథ అయితే వచ్చిందట. దానికి తగ్గట్టుగానే రాజమౌళి అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పారట. ఇక రాజమౌళి సెకండ్ టీం మొత్తం ఆ పనులు చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక మహేష్ బాబు వారణాసి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాని స్టార్ట్ చేయాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సినిమా సినిమాకి మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకోకూడదనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి ఉన్నాడట. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే మరో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు…