Rajamouli New Plan Against Bollywood Ramayan: ఒకప్పుడు టాప్ పొజిషన్ లో నిలిచిన బాలీవుడ్ ఇండస్ట్రీ గత కొద్దిరోజులుగా ఆశించిన మేరకు సక్సెస్ లను సాధించడం లేదు. తెలుగు సినిమాల డామినేషన్ ఎక్కువైపోతూ ఉండడంతో నార్త్ లో మొత్తం తెలుగు హీరోల హవానే కొనసాగుతుంది. అక్కడి ప్రేక్షకులు సైతం మన తెలుగు హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన వాళ్లకు అక్కడి ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్బీర్ కపూర్ ప్రస్తుతం ‘రామాయన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అతను రాముడిగా నటిస్తున్నాడు. సాయి పల్లవి సీతగా నటిస్తూ ఉండడం విశేషం…నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే రాజమౌళి చేస్తున్న ‘వారణాసి’ సినిమాకి ఈ సినిమాకి మధ్య విపరీతమైన పోటీ ఉంది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ‘వారణాసి’ సినిమా తెరకెక్కుతున్న బడ్జెట్ కంటే కూడా రామాయన్ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ కాబట్టి ఆ మూవీని డామినేట్ చేయాలి అంటే రాజమౌళి అంతకు మించిన ఎఫర్ట్స్ పెట్టి సినిమాను చేయాలి. వారణాసి సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టినప్పుడు మాత్రమే ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ చాలామంది సినిమా విమర్శకులు సైతం మాట్లాడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి రామాయన్ ను బీట్ చేసేలా ఒక భారీ ప్రణాళికనైతే రూపొందించారట.
Also Read: ‘ఫౌజీ’ సినిమా టీజర్ లో ప్రభాస్ అలా కనిపించబోతున్నాడా..?
‘వారణాసి’ సినిమా మీద వస్తున్న భారీ బజ్ ను వాడుకుంటూ సినిమా కోసం ఎక్కువ ప్రమోషన్స్ చేసి సినిమాని ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సినిమా అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇదంతా చూస్తున్న నెటిజన్లు సైతం రాజమౌళి సినిమా కోసం ఏదైనా చేస్తాడు తను పెట్టిన బడ్జెట్ రికవరీ చేయడానికి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడానికి ఆయన చాలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఇప్పటికి కూడా రామాయన్ సినిమా కంటే కూడా వారణాసి సినిమా మీదనే ఎక్కువ బజ్ ఉందంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…
రాజమౌళి మాత్రం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరిని తన సినిమా ప్రమోషన్స్ కి పిలిచి వాళ్ళతో డిఫరెంట్ ఆక్టివిటీస్ చేయించాలని తద్వారా సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారట… ఇక ఇది కనక వర్కౌట్ అయితే మాత్రం రాజమౌళి అనుకున్నట్టుగానే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయి…