Rajamouli Movies Heroes Without Industry Hit: దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన ప్రత్యేకతను చాటుకుంటాడు. ప్రేక్షకులను మెప్పించే విధంగా సన్నివేశాలను మలచడంలో ఆయనను మించిన వారు మరెవరు లేరు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాను సైతం భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాజమౌళిని మించిన సినిమాలైతే ఎవ్వరు చేయలేకపోతున్నారు. ఆయన దర్శకత్వం నటించిన తరువాతే చాలా మంది హీరోలు టాప్ హీరోలుగా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. కొంతమంది మాత్రం రాజమౌళి దర్శకత్వంలో నటించిన కూడా వాళ్లకు ఇండస్ట్రీ హిట్ దక్కడం లేదు.
అందులో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు రాజమౌళితో నాలుగు సినిమాలను చేసిన జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్క ఇండస్ట్రీకి కూడా రాలేదు. ఇక నితిన్ కి సైతం ఇండస్ట్రీ హిట్ అయితే దక్కలేదు. రాజమౌళితో సై అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఒక మోస్తరు సక్సెస్ గా మాత్రమే ఆడింది… రవితేజ సైతం జక్కన్న తో ‘విక్రమార్కుడు’ సినిమా చేశాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కానీ ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ కాలేకపోయింది. ఇక నాని చేసిన ఈగ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది కానీ ఇండస్ట్రీ హిట్ గా మారలేకపోయింది…సునీల్ తో చేసిన మర్యాద రామన్న డీసెంట్ హిట్ గా మిగిలింది.
మొత్తానికైతే ఈ హీరోలందరు రాజమౌళి దర్శకత్వంలో నటించిన కూడా ఇండస్ట్రీ హిట్ దక్కపోవడంతో వాళ్ల అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు…ఇక వీళ్ళందరిలో ఎన్టీఆర్ ఒక్కడే టైర్ వన్ హీరోగా మారాడు…రాజమౌళి తో చేసిన సినిమాలను మినహాయిస్తే ఎన్టీఆర్ కి ఇతర హీరోలతో చేసిన సినిమాలతో కూడా ఇండస్ట్రీ హిట్ దక్కలేదు…