https://oktelugu.com/

Rajamouli Mahesh Movie: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి బాలీవుడ్ మూవీ.. మహేష్ సంగతేంటి?

Rajamouli Mahesh Movie: దర్శకధీరుడు రాజమౌళి ఏది చేసినా కానీ అందులో కొత్తదనం ఉంటుంది. ఒక భారీ బడ్జెట్ మూవీ తర్వాత అంచనాలను తగ్గించేందుకు ఆయన చిన్న సినిమాలు తీస్తుంటాడు.. మగధీర తర్వాత అసలు హీరోనే లేకుండా ఈగను పెట్టి ‘ఈగ’ సినిమా తీశాడు. ఇక ఆ తర్వాత కూడా మధ్యలో ‘మర్యాదరామన్న’ అనే చిన్న సినిమాను కమెడియన్ సునీల్ హీరోగా తీశాడు. ఇప్పుడు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీల తర్వాత కూడా రాజమౌళి అదే పంథాలోకి వెళ్లనున్నట్టు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2021 / 01:40 PM IST
    Follow us on

    Rajamouli Mahesh Movie: దర్శకధీరుడు రాజమౌళి ఏది చేసినా కానీ అందులో కొత్తదనం ఉంటుంది. ఒక భారీ బడ్జెట్ మూవీ తర్వాత అంచనాలను తగ్గించేందుకు ఆయన చిన్న సినిమాలు తీస్తుంటాడు.. మగధీర తర్వాత అసలు హీరోనే లేకుండా ఈగను పెట్టి ‘ఈగ’ సినిమా తీశాడు. ఇక ఆ తర్వాత కూడా మధ్యలో ‘మర్యాదరామన్న’ అనే చిన్న సినిమాను కమెడియన్ సునీల్ హీరోగా తీశాడు. ఇప్పుడు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీల తర్వాత కూడా రాజమౌళి అదే పంథాలోకి వెళ్లనున్నట్టు సమాచారం.

    ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన రాజమౌళి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడ్డాడు. సినిమాను దసరాకు అనౌన్స్ చేసినా ఇప్పట్లో థియేట్రికల్ రిలీజ్ కరోనా భయంతో కష్టం కాబట్టి వాయిదా వేశాడు. ఈసారి విడుదల తేదీని మాత్రం రాజమౌళి ప్రకటించలేదు. మళ్లీ కరోనా పోయి మామూలు పరిస్థితులు ఏర్పడితే అప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది.

    ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్ బాబు హీరోగా సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో భారీ అడ్వంచర్ మూవీ ఇదీ.. దీనికోసం ఇప్పటికే విజయేంద్రప్రసాద్ కథను రూపొందిస్తున్నట్టుగా తెలిసింది.

    అయితే సడెన్ గా రాజమౌళి మనసు మారింది. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ ను కలిసి ఒక బాలీవుడ్ సినిమాకు రాజమౌళి ప్లాన్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో ఒక మంచి చిన్న కాన్సెప్ట్ తో సినిమా తీయాలని.. దాన్ని మూడు నెలల్లోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట..

    ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారివారి పాట’తో బీజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ మూవీ ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి సమ్మర్ పూర్తి అవుతుంది. అందుకే ఈ లోపు ఖాళీగా ఉండకుండా ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఒక చిన్న సినిమా.. అదీ బాలీవుడ్ లో తీసేందుకు రాజమౌళి ప్లాన్ చేసినట్టు సమాచారం. మహేష్ బాబు రెండు సినిమాలు పూర్తయ్యి బయటకు వచ్చేలోగా ఇది పూర్తి చేయడానికి రాజమౌళి రెడీ అయ్యాడట.. అదీ సంగతి.

    మహేష్ తో రాజమౌళి సినిమా ఉండదు అనుకుంటున్న అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. రాజమౌళి చిన్న సినిమాను పూర్తి చేసి మహేష్ తో భారీ యాక్షన్ అడ్వంచర్ మూవీకి రెడీ అవుతాడని అంటున్నారు.