Rajamouli Using Star Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకధీరుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి లాంటి దర్శకుడు మాత్రం ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఇప్పటికే ఆయన బాహుబలి (Bahubali) సినిమాలతో పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదిగిపోయాడు. ఇంటర్నేషనల్ స్థాయిలో మహేష్ బాబు చేస్తున్న సినిమాని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. తద్వారా ఈ సినిమాతో తనను తాను మరోసారి ఎలా ఎలివేట్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటే మాత్రం ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకున్న వాడవుతాడు… ఒకవేళ ఇలా చేయకపోతే ఆయన భారీగా నష్టపోయే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగితే చాలా మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…అయితే రాజమౌళి తన సినిమాలో డైలాగ్స్ ని చాలా పవర్ ఫుల్ గా వాడుతూ ఉంటాడు. కాబట్టి డైలాగ్ రైటర్ ని ఎంచుకునే విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతాడు. ఇక కెరీర్ మొదట్లో ఏం రత్నంతో డైలాగులు రాయించిన ఆయన ఆ తర్వాత త్రిబుల్ ఆర్ (RRR) సినిమా కోసం సాయి మాధవ్ బుర్ర ను తీసుకున్నాడు.
Also Read: గౌతమ్ గంభీర్ కాదు.. టీమిండియా కు .. రవి శాస్త్రి, అనిల్ కుంబ్లే లాంటి వాళ్లే కావాలిప్పుడు!
ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం తెలుగులో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దేవకట్టా ను ఎంచుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. దేవకట్టా బాహుబలి మొదటి పార్ట్ లోని క్లైమాక్స్ సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్ ని రాశాడు. అప్పటినుంచి వీళ్ళ మధ్య మంచి ర్యాపో అయితే కుదిరింది.
ఇక అప్పుడు దేవకట్టా టాలెంట్ ని గుర్తించిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబు తో చేస్తున్న సినిమాకి డైలాగ్స్ అందించమని కోరడంతో దేవకట్టా సైతం కాదనలేకపోయాడు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకి దేవకట్టానే డైలాగ్ రైటర్ గా పని చేస్తుండడం విశేషం…
ఒకవైపు దేవకట్టా తన సినిమాలను డైరెక్షన్ చేస్తూ డైలాగ్ రైటర్ గా వర్క్ చేయడం అనేది అతని అభిమానులను ఆనందపరుస్తోంది. మరి ఇప్పుడు దేవకట్టా డైరెక్షన్లో వస్తున్న మయసభ సిరీస్ సైతం ఈనెల 7వ తేదీన సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ తో ఆయన సక్సెస్ సాధిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…