Rajamouli: టాలీవుడ్ రేంజ్ ను ప్రపంచ వ్యాప్తంగా పాకేలా చేసిన డైరెక్టర్ ఎవరంటే అందరు చెప్పే పేరు రాజమౌళి. బహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా ఆయన సాధించిన విజయాలు ఎన్నో.. అందుకే టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే గ్రేట్ డైరెక్టర్ గా రాజ్యమేలుతున్నారు జక్కన్న. స్టూడెంట్ నంబర్1 నుంచి ఆర్.ఆర్. ఆర్ వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ఈయన. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ డైరెక్టర్ ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ.. తన కెరీర్ లో కూడా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించిన సినిమాలు జక్కన్న ఖాతాలోనే ఉన్నాయి. ఇక ఇతర డైరెక్టర్లు వరుస విజయాలు సాధిస్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి మాత్రమే కింగ్ అంటున్నారు నెటిజన్లు. బెస్ట్ డైరెక్టర్, సక్సెస్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్ అంటూ ఈయన వైపే మొగ్గు చూపుతున్నారు. అంతే కాదు ఈ డైరెక్టర్ ను మించిన డైరెక్టర్ ఎవరూ లేరని కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ విధమైన సక్సెస్ ను సాధించడానికి ప్రధాన కారణం ఆయన చిన్న టేక్ లో కూడా రాజీ పడరట. ప్రతి ఫ్రేమ్ కూడా పర్ఫెక్ట్ గా రావాలని చూస్తుంటారు జక్కన్న. అందుకే ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నారు.
జక్కన్న స్థాయి బడ్జెట్లతో సినిమాలు తీయడానికి కూడా చాలామంది దర్శకులకు ధైర్యం చాలడం లేదు. అంతే కాదు ఆయన తీసిన సినిమాలకు బడ్జెట్ కు మించి.. అనుకోని రేంజ్ లో కలెక్షన్లు వస్తుంటాయి. మరి ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ కూడా ఎరుగని ఈ డైరెక్టర్ రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాలి. కానీ ఇప్పటికి మాత్రం ఇండస్ట్రీలో ఈయననే తోపు డైరెక్టర్ అని పేరు సంపాదించారు. ఏ డైరెక్టర్ కెరీర్ లో అయినా ఒక్క ఫ్లాప్ అయినా ఉంటుంది. కానీ రాజమౌళి కెరీర్ లో మాత్రం ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అందుకే ఈయనకు ఉన్న క్రేజ్ ఇతర డైరెక్టర్లకు లేదంటారు ఆయన అభిమానులు.